Home Andhra Pradesh జ‌గ‌న్‌పై దాడి కేసు: నిందితుడి ఖాతాలో డబ్బు జమ చేసిన అమ్మాయి

జ‌గ‌న్‌పై దాడి కేసు: నిందితుడి ఖాతాలో డబ్బు జమ చేసిన అమ్మాయి

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో సిట్ దర్యాప్తులో అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలను పరిశీలించారు అధికారులు. కాగా శ్రీనివాస్ కు సంబంధించిన బ్యాంకు అకౌంట్ లో 40000 రూ. ఒకసారి, 20000 ఒకసారి జమ అయ్యాయి. జమ అయిన కొద్దిసేపటికి ఆ డబ్బు వేరే అకౌంట్ కు బదిలీ అయ్యాయి. ఈ డబ్బు ఎవరు వేశారు? ఎవరి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి? ఈ విషయాలపై దృష్టి సారించిన అధికారులకు కొన్ని నిజాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు కింద చదవండి.

శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్ లో మొదట 40000 జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని రమాదేవి అనే ఒక యువతి శ్రీనివాస్ అకౌంట్ లో వేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బు వేసిన కొద్దిసేపటికి శ్రీనివాస్ అకౌంట్ నుండి వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మరో 20000 రూ. కూడా రమాదేవి అనే యువతి శ్రీనివాస్ అకౌంట్ కు పంపింది. అవి కూడా కొద్దిసేపటికి మరో అకౌంట్ కి బదిలీ అయిందని సీపీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు.

కాగా శ్రీనివాస్ అకౌంట్ లో డబ్బు చేసిన రమాదేవి…తన సోదరుడికి పంపడం కోసమే డబ్బు జమ చేసినట్టు తెలిపింది. ఆ విషయాల్ని కూడా ఆరా తీస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతే కాదు శ్రీనివాస్ వాడిన తొమ్మిది ఫోన్లలో ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మరో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఒక ఫోన్ యానాంలో పోగొట్టారని, మరో ఫోన్ ఇద్దరు వ్యక్తుల వద్ద ఉందని శ్రీనివాస్ చెప్పినట్టు అధికారులు తెలిపారు. కానీ ఆ ఫోన్ వారి వద్ద లేదని స్పష్టం చేసారు అధికారులు. నిందితుడితో పని చేసిన వ్యక్తులను విచారించేందుకు ఒక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపామని, మరో బృందాన్ని ఒడిశా పంపాల్సి ఉందని వెల్లడించారు.

కాగా వైసీపీ శ్రేణులు మాత్రం సిట్ ఇన్వెస్టిగేషన్ మీద తమకు నమ్మకం లేదని తేల్చి చెబుతున్నారు. నిందితుడిని రోజులు తరబడి విచారిస్తున్నా సహరించట్లేదని మీడియా అంటుంటే, నిందితుడు మాత్రం మీడియాతో ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించండి అని వేడుకుంటున్నాడని…విచారణపై అనుమానం వ్యక్తం చేసారు విజయసాయిరెడ్డి. కుట్రపై మరొక కుట్ర జరుగుతుందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేసారు.

- Advertisement -

Related Posts

వాలంటీర్లకి బిగ్ షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ?

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమయింది. ఏపీ ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినట్టే...

ఇక ప్రతీ గ్రామం జగన్ కి ఓటు వేయడం గ్యారెంటీ , ఇదే ఉదాహరణ !

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆగిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూశారు. ఇక విద్యార్థుల అవస్థలు అయితే అన్ని ఇన్ని కావు. ఆన్‌ లైన్‌ చదువులతో...

కుప్పంలో వైసీపీని చూసి పెద్దిరెడ్డి షాక్.. ఆయన ముందే గొడవలు ?

చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది.  అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం.  30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు. ...

నిమ్మగడ్డ తమకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాడు అని ఆనందించేలోపు చంద్రబాబు కి షాక్ !

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం జెడ్పీటీసీ...

Latest News