రెండు పడవల ప్రయాణం.. పవన్ కళ్యాణ్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందా?

సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరు రంగాలు కాగా ఒక రంగంలో సక్సెస్ అయిన వాళ్లు మరో రంగంలో సక్సెస్ సాధించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రెండు రంగాల్లో సక్సెస్ సాధించిన వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పడవల ప్రయాణం నేపథ్యంలో పవన్ కోరుకున్న సక్సెస్ రాజకీయాల్లో దక్కుతుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించిన వాళ్లు ఇందులో సక్సెస్ అవుతారో లేదో కొన్ని సందర్భాల్లో చెప్పలేమనే సంగతి తెలిసిందే. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీక్ డేస్ లో సినిమాల షూటింగ్ లలో పాల్గొనాలని వీకెండ్ లో మాత్రం రాజకీయ కార్యక్రమాలకు కేటాయించాలని భావిస్తున్నారు. రెండు పడవల ప్రయాణం పవన్ ను ముంచుతుందని మరి కొందరు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ సరైన ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని మరి కొందరు చెబుతుండటం గమనార్హం. పవన్ సినిమాలకు దూరంగా ఉండి పాదయాత్ర లేదా మరో విధంగా ప్రజలతో మమేకమై ప్రజల హృదయాలకు దగ్గరైతే మాత్రమే పరిస్థితులు మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పవన్ రాజకీయాల విషయంలో ఫ్యాన్స్ సైతం సంతృప్తితో లేరు.

పవన్ నిర్ణయాల వల్ల పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని వాళ్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు చేతిలో చాలా సందర్భాల్లో మోసపోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఆయననే నమ్మడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.