రాష్ర్టంలో ప్రభుత్వాలు తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాయని బీజేపీ. జనసేన నేతలు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు, ప్రస్తుతం జగన్‌మోహనరెడ్డి వ్యవహారశైలి ఇలానే ఉందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎన్నోసమస్యలు ఉండగా కేవలం రాజధాని పేరుతో రాద్ధాం చేస్తున్నారని విమర్శస్తున్నారు. రాష్టంలో జరుగుతున్న విషయాలను కేంద్రం గమనిస్తుందని అంటూనే కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగానే స్పందన ఉంటుందని చెబుతున్నారు.మూడు రాజధానుల నిర్ణయానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మద్దతు ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఓటింగ్ జరిగితే మూడు రాజధానులకే సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని పరిపాలనా వికేంద్రీ కరణ అవసరమని అంటున్నాడు.
సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులా మారాడని పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజదాని అమరావతి మార్పు విషయం బీజేపీ ఆడుతున్న నాటమని అంటున్నాయి. రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్నపాత్ర వహించి చక్కదిద్దాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ అమలు జరుగుతున్న పనులను చూస్తే కేంద్రం అనుమతితోనే సీఎం జగన్ ముందుకెళ్తన్నాడనే అనే వియషం తెలుస్తుందంటున్నారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఆపార్టీ రాష్ర్ట నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని , వారి మౌనం జగన్ చర్యలకు అంగీకారమేగా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు లాంటి అంశాలను చెప్పకుండా ఎలా ముందుకెళ్తుందని అడుగుతున్నారు. దేశ ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికే దిక్కు లేకపోతే ఎలా అంటున్నారు. కేంద్రం నుంచి రాజధాని విషయంలో ఒక్క ప్రకటన వెలువడితే రాష్ర్ట ప్రభుత్వం ముందుకెళ్ల గలదా అని పీసీసీ నేతలు పేర్కొంటున్నారు.
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధిపై శ్రద్ధ పెట్టకుండా కొన్ని పార్టీలను మచ్చిక చేసుకొని పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టడమేమిటని అడుగుతున్నారు.టీడీపీ సీనియర్ నేత, మేధావిగా పలు నిర్ణయాల్లో కీలకభాగస్వామిగా ఉండే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎట్టకేలకు స్పందించారు. సుమారు 40 రోజులకు పైగా రాష్ర్టంలో మూడు రాజధానుల విషయమై రావణకాష్టంలాగా ఆందోళన కొనసాగుతోంది. ఏ విషయాన్ని అయినా ఆచిచూచి మాట్లాడే స్వభావం ఉన్న ఆయన్ను కూడా విలేకర్లు స్పందించేలా చేశారు. పైగా రాజుగారు ఉత్తరాంధ్రలో కీలకనేత. రాజధాని విషయంలో విశాఖపట్నం కీలకంగా మారనున్న నేపథ్యంలో ఆయన వ్యఖ్యలు కీలకం కానున్నాయి. అనారోగ్యం కారణంతో కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సీఎం పవర్‌ను కూడా జగన్ విభజిస్తారా? ముఖ్యమంత్రి ఆఫీసును కూడా ఎత్తేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీది నియంత పాలనలా ఉందన్నారు. అమరావతి మంత్రులు శ్మశానం అన్నారని మరి శ్మశానంలో కర్వ్యూ ఎంటని ప్రశ్నించారు.