ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు ప్రజల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పుంజుకోవడం లేదు. లోకేశ్ వల్ల టీడీపీకి మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో వర్కౌట్ కావడం లేదు.
అయితే ఏపీలో పాదయాత్ర చేసిన వాళ్లు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని గతంలో పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ ప్రజలకు మేలు చేసే పథకాలను అమలు చేయడం జరిగింది.
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు, 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావడంతో పాటు ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకున్నారు. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.
టీడీపీ, జనసేన తమ మ్యానిఫెస్టోను ప్రకటించి ఏపీ ప్రజలకు మరింత బెనిఫిట్ కలిగేలా ఆచరణ సాధ్యమయ్యే హామీలతో ముందుకెళితే మంచిదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల షూటింగ్ లను పూర్తి చేసి ఫుల్ టైమ్ రాజకీయాలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం ఎన్నికల ఫలితాలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.