తెలంగాణ రాజకీయాల్లోకి ఆంధ్రా స్వామీజీ , సక్సెసవుతాడా?

 

తెలంగాణలో సెంటిమెంటు రాజకీయాలే ఎక్కువ. సులభంగా సెంటిమెంట్ ను ఆయుధంగా వాడుకోవడం అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక ఆంధ్రా స్వామీజీ సిద్ధంగా ఉన్నారు. తనను ఆహ్బానించే పార్టీ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.  బిజెపి ఆయన్ని ఆహ్వానించిందని కూడా చెబుతున్నారు.

  ఆ స్వామీ జీ ఎవరో కాదు, కాకినాడ శ్రీ  పీఠానికి చెందిన పరిపూర్ణానంద స్వామీజీ. ఆశ్రమం కాకినాడలో ఉన్నా ఆయన ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ మాత్రం తెలంగాణ క్యాపిటల్  హైదరాబాదే. అందువల్ల హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్ నుంచి ఎన్నికల్లో పో టీచేయాలనుకుంటున్నారు.  ఆయన నిజానికి తెలంగాణ కు యోగి ఆదిత్యనాథ్ కావాలనుకుంటున్నారు.  ఈ కోరికను ఆయన చాలాసార్లు పరోక్షంగా వెల్లడిస్తూ తెలంగాణకు కూడా ఒకయోగి ఆదిత్యనాథ్ అవరసరమని అంటూవస్తున్నారు. స్వామిజీ  యోగి ఆదిత్యనాథ్ అయితే, తెలంగాణ మళ్లీ ఆంధ్రనాయకత్వంలోకి వెళ్లినట్లేనా… దీనిని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? స్వామీజీలకు ఆంధ్ర తెలంగాణలు ఉండవని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? లేక అత్యంత భక్తి విశ్వాసాలతో ఉండే ముఖ్యమంత్రి కెసియార్, హిందూత్వం కోసం పని చేసే స్వామి పూరిపూర్ణాానంద రాజకీయ ప్రత్యర్థులవుతారా లేక సహచరులవుతారా చూడాలి. ఎందుకంటే, చినజీయర్ స్వామీజీ సేవలో ఉండే ముఖ్యమంత్రి పరిపూర్ణానంద స్వామీని ఎపుడూ పెద్ద గా పట్టించుకోలేదు. ఆయన్నింతవరకు కలసి ఆశీస్సులందుకున్నట్లు లేదు.  అందువల్ల తెలంగాణ రాజకీయాలలో ఆంధ్ర స్వామీజీ ప్రవేశిస్తే ఏమవుతుంది?

అసలేం జరగుతున్నదో చూద్దాం.

 

ఈ మధ్య నగర బహిష్కరణ తర్వాత ఈ కరిష్మాటిక్ స్వామీజీ బాగా పాపులర్ అయ్యారు. ఆయన కత్తి మహేశ్ తో పెట్టుకున్న వివాదంతో ఆయన రాజకీయనాయకుడయ్యే లక్షణాలున్నాయని ఆయన హిందూసంస్థలు, అభిమానులు గుర్తించారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆయన్ని తెలంగాణ యోగీ ఆదిత్యనాథ్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణా అసెంబ్లీకి గాని,సికిందరాబాద్ లేదా మల్కాజ్ గిరి నుంచి గాని ఆయన పోటీచేస్తారని అంటున్నారు. హిందూవాహిని వంటి సంస్థలు ఆయన హైదరాబాద్ నుంచి పోటీ చేసి ఎంఐఎం నుంచి హైదరాబాద్ కైవలసం చేసుకోవాలని కూడా చూస్తున్నారు. పోటీ చేయాలని నిర్ణయానికి వస్తే, హైదరాబాదా, సికిందరాబాదా, మల్కా జ్ గిరియా అని చూడకుండా ఎక్కడినుంచైనా స్వామిజీ పోటీ చేస్తారని ఆయన సన్నిహితుడయిన హిందూసంస్థనాయకుడొకరు  చెప్పారు.

అయితే, ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఇలా స్వామీజీ రాజకీయాలాభిషను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి

జూలై లో హైదరాబాద్ నుంచి ఆయన ను బహిష్కరించారు. తర్వాత కోట్లు ఆయన మీద ఉన్న బహిష్కరణను ఎత్తివేసింది. ఆయన అధివారం నాడు హైదరాబాద్ వచ్చారు. ఘన స్వాగతం లభించింది. ఆయన హీరో వెల్ కమ్ లభించింది.  హైదరాబాద్‌పోలీసులు కూడా విపరీతంగా బందోబస్తు పెట్టి, ఆయనకు ప్రాముఖ్యాన్ని పెంచడంతో హిందూసంస్థల నాయకులలో ఆయనకు రాజకీయ నాయకుడి లక్షణాలున్నాయనేనమ్మకం పెరిగింది. రాజకీయ నాయకుడికి ఇచ్చినట్లు ఆయన పునరాగమనం సందర్భంగా నినాదాలు కూడా చేశారు. సహజంగా ఆయనకు బిజెపి బాసటగా నిల్చింది. మామూలు రాజకీయనాయకులైన దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటివారు బిజెపిని తెలంగాణ లో ఒక శక్తిగా మార్చలేరని, దీరికి  ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి రాజకీయ యోగి అవసరమని, దీనికి  పరిపూర్ణానంద స్వామీజీ తగిన వ్యక్తి ని బిజెపి నాయకులు భావిస్తున్నారు. నమ్ముతున్నారు కూడా.

హిందుత్వ కార్డును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దానిని వోట్లగా మార్చగలగే శక్తి ఖాదీబిజెపి నేతల కంటే కాషాయం నేతకు ఎక్కువ గా ఉంటుందని వారు గుర్తించారు. అందువల్ల స్వామీజీకి నాయకత్వం అప్పగించేందుక బిజెపి నేతలు సిద్ధమయ్యారు. ఆయన ఏ నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గాన్ని అప్పగించేందుకు తెలంగాణ బిజెపి సిద్ధమయిందని తెలిసింది.

  ఈ నేపథ్యంలో స్వామీజీ తన రాజకీయ ప్రవేశం గురించి స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సముఖం చూపారు. ‘నేను ఒక రాజకీయ పార్టీలో చేరతానని చెప్పలేదు. నా సిద్దాంతాలు, ఆలోచనలకు దగ్గరగా ఉండే  పార్టీ ఉంటే తప్పక చేరుతాను. నేనుగా  ఏ పార్టీ దగ్గరకు వెళ్లను.. ఏదయినా  పార్టీకి నా అవసరం ఉంటే ఆ పార్టీ వారే  వచ్చి అడగితే అపుడు ఆలోచిస్తాను’ అంటూ పరిపూర్ణానంద చాలా డిప్లోమాటిక్ స్పందించారు.

‘‘అంతా తనని యోగి ఆదిత్యనాథ్‌తో పోలుస్తున్నారని,  కేవలం వయసులో తప్పామా యిద్దరి మధ్య పోలిలకలు లేవు. నేను ఆయనకు సమానం కాదు, యోగికి రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది. నాలుగు సార్లు ఆయన ఎంపీగా పనిచేశారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి,’’ అన్నారు. ఆయనకు ఈ మధ్య బాగా మద్దతునిచ్చిన రాజాసింగ్ తరఫున ఆయన ఎనికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు.  వచ్చే అసెంబ్లీ  గోషామహల్‌  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బిజెపి ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ తరుఫున  ప్రచారం చేస్తానని స్పష్టంగా చెప్పారు. ఇది ఆయన తొలిరాజకీయ కార్యక్రమం అవుతుంది.‘‘ హిందుత్వం కోసం ఎవరు పాటుపడుతారో వారందరికి నా మద్దతు ఉంటుందని కూడా ఆయన చెప్పారు.