హిట్‌తోనే కాదు, ప్రియుడితో కలిసి భర్తను మట్టు పెట్టింది

భర్త నోట్లో హిట్ కొట్టి చంపింది అని ప్రచారం అయింది కానీ పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిట్ తో కాదు ప్రియుడితో కలిసి భర్తను మట్టు పెట్టినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. హైద్రాబాద్ లో సంచలనం రేపిన హత్య కేస్ మిస్టరీని ను 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. వివరాలు చదవండి.

రెండేడ్లుగా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న దేవిక పక్కా ప్రణాళికతో భర్త జగన్  అడ్డు తొలగించుకోవాలని హత్య చేసింది.  దేవిక, జగన్ నాయక్ దంపతులు. వీరు ఫిలింనగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. దేవిక ఫిలింనగర్ లోని అడ్వాన్స్ డ్ సాఫ్ట్ సంస్థలో హౌజ్ కీపింగ్ పనిలో చేరింది. అక్కడ సూపర్ వైజర్ గా పనిచేసే కృష్ణా జిల్లాకు చెందిన తోట బెనర్జీతో దేవికకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరు కలిసి కూడా తిరిగారు. బెనర్జీ దేవిక వాళ్ల అమ్మగారింటికి పోయి దేవికను పెళ్లి చేసుకుంటానని బహిరంగంగా చెప్పాడు. దాంతో వారు బెనర్జీ ని తిట్టి కొట్టి పంపించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో జగన్ పంచాయితీ పెట్టగా పెద్ద మనుషులు సర్ధి చెప్పి పంపారు. దేవిక ప్రియుడు బెనర్జీ జగన్ కు తెలియకుండా వీరు కిరాయికి ఉంటున్న ఇంటిలోనే పెంట్ హౌజ్ లో అద్దెకు దిగాడు.

కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనతో అనుమానపడిన జగన్…  దేవిక, బెనర్జీ బయట కలుస్తున్నట్టు తెలుసుకున్నాడు. సోమవారం రాత్రి దేవికను తీవ్రంగా తిట్టి సంగతి తేలుస్తానని  హెచ్చరించి పడుకున్నాడు. దీంతో దేవిక పెంట్ హౌజ్ లో ఉన్న బెనర్జీని పిలిచి జగన్ ను చంపేద్దామని ప్లాన్ వేసింది. అదే సమయంలో జగన్ లేవగా బెనర్జీ జగన్ పై ఎలక్ట్రీకల్ కుక్కర్ పెట్టి ఊపిరాడకుండా చేశాడు. దేవిక జగన్ మర్మాంగాలపై తన్ని పిసికేసింది. ఆ నొప్పితో జగన్ విలవిలలాడుతుండగా బెనర్జీ జగన్ చాతిపై కూర్చొని ముక్కు మూశాడు. దీంతో జగన్ ఊపిరాడక చనిపోయాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరిచేందుకు జగన్ నోట్లో హిట్ కొట్టింది. తనపై భర్త దాడి చేశాడని నమ్మించేందుకు బీరు సీసా పగుల గొట్టి చేతులను కోసుకుంది. బెనర్జీ వెళ్లిపోయాక తమ్ముడు రమేష్ కు ఫోన్ చేసి దేవిక విషయం చెప్పింది.

పిల్లలు పోలీసులకు  ఓ అంకుల్ వచ్చాడని చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా దేవిక అసలు నిజం తెలిపింది. బెనర్జీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను చంపానన్న బాధ కొంచెం కూడా లేకుండా దేవిక స్టేషన్ లో గడుపుతున్న తీరును చూసి అంతా ఆశ్చర్యానికి  గురయ్యారు. క్షణికానందం కోసం జీవితాలు ఆగం చేసుకుంటున్నారని పలువురు అన్నారు.