హైదరాబాద్ ఫిలింనగర్ లో దారుణం జరిగింది. తన భర్తను చంపి ఆ దారుణానికి ఒడిగట్టింది తనేనని ఆ నిందితురాల ఒప్పుకుంది. జగన్, దేవిక భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. నిందితురాలు దేవిక జరిగిన విషయాన్ని వెల్లడించింది.
“ మద్యానికి బానిసైన జగన్ సోమవారం రాత్రి తాగి వచ్చాడు. నాతో గొడవ పడ్డాడు. మా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. జగన్ నాపై చేయి చేసుకున్నాడు. అంతే కాకుండా నన్ను చంపి తాను కూడా చనిపోతానంటూ నాపై దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో నన్ను కాపాడుకోవడానికి బొద్దింకలను చంపే హిట్ తీసుకొని జగన్ నోట్లో స్ప్రే చేశాను. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జగన్ అడ్డం పడ్డాడు. నేను అతను కావాలనే నాటకమాడుతున్నాడని అనుకొని అతని గొంతు నలిపాను. చనిపోతాడని మాత్రం అనుకోలేదు. కావాలని మాత్రం చంపలేదు” అని దేవిక తెలిపింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది దేవికనే చేసిందా లేక ఎవరైనా వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.