అవును తెలుగుదేశంపార్టీకి ఇది మామూలే. ఏదైనా గబ్బు పని చేయటం అది బయటపడితే వెంటనే ఎదురుదాడి చేయటం టిడిపికి అలవాటైన విద్యే. అందులో భాగంగానే హఠాత్తుగా టిడిపి వెబ్ సైట్ క్లోజ్ అయిపోయింది. ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీతో తమ పార్టీ డేటాను అప్ డేట్ చేయిస్తున్నట్లు చంద్రబాబానాయుడు అండ్ కో అబద్ధాలు చేబుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అయితే, పార్టీ కార్యక్రమాలు, సేవామిత్ర వివరాలు బయటపడుతుందన్న ఉద్దేశ్యంతోనే వెబ్ సైట్ ను మూసేశారు.
ఎప్పుడైతే ఐటి గ్రిడ్ వ్యవహారం బయటపడిందో వెంటనే జనాలందరూ టిడిపి వెబ్ సైట్ ను వెతుకుతారని టిడిపి ముఖ్యులు ఊహించారు. వెబ్ సైట్ ను గనుక జనాలు లేకపోతే ఎవరైనా నిపుణులు బ్రౌజ్ చేస్తే ఐటి గ్రిడ్ బండారం బయటపడుతుందన్న అనుమానంతోనే వెబ్ సైట్ ను క్లోజ్ చేసినట్లు సమాచారం.
టిడిపి కార్యక్రమాలకు సంబంధించి ఐటి గ్రిడ్ సాఫ్ల్ వేర్ కంపెనీ చేస్తున్న పనేంటో తెలుసుకునే ఉద్దేశ్యంతో తెలుగుదేశంపార్టీ డాట్ ఓఆర్జీ అనే వెబ్ సైట్ ఓపెన్ చేయాలని అనుకున్న వాళ్ళకి నిరాసే మిగిలింది. ఎందుకంటే, వెబ్ సైట్ తెరుచుకోవటం లేదు. ఎర్రర్ అని కనిపిస్తోంది. దాంతో గ్రిడ్ కంపెనీ టిడిపి వెబ్ సైట్ కు అందిస్తున్న సేవలేమీ లేవని అందరూ అనుమానిస్తున్నారు. నిజానికి డేటా చోరీ స్కాంలో టిడిపికి కానీ ఐటి గ్రిడ్ కు కానీ సంబంధం లేకపోతే వెబ్ సైట్ ఎందుకు క్లోజ్ చేశారు ?