గెలిచి మాట్లాడాలి.! ఔను, గెలిచాకే మాట్లాడాలి.! ఓడితే మాట్లాడకూడదా.? అంటే, ఎందుకు మాట్లాడకూడదు.? గెలిచి మాట్లాడితే, ఆ మాటకి విలువెక్కువ. సవాళ్ళు విసిరి, చేతకాకపోతే.. ఆ తర్వాత సవాళ్ళు విసరడానికి అవకాశం వుండదు.
ముఖ్యమంత్రి కుర్చీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డని కూర్చోనివ్వను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వను.. అంటూ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినదించారు. కానీ, ఏం జరిగింది.? పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి.. అసెంబ్లీ గేటు తాకే అర్హతనీ కోల్పోయారు.!
ఇప్పుడేమో, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలవనివ్వనంటున్నారు. ‘భీమ్లానాయక్’ తరహా ట్రీట్‌మెంట్ ఇస్తారట. ద్వారంపూడిని కొట్టుకుంటూ తీసుకెళతారట. అలాగని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తోంటే, అంతా నవ్వుకోవాల్సి వస్తోంది.
‘పచ్చి రాజకీయ వ్యభిచారివి నువ్వు..’ అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్‌కి. అవసరమా ఇదంతా.? ఛాలెంజెస్ విసిరేటప్పుడు.. గతంలో ఏం మాట్లాడిందీ గుర్తు చేసుకోకపోతే ఎలా.?
నిజానికి, ఈసారి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి వుండాలి. సైలెంట్ విక్టరీ గురించి ఆలోచించి వుండాలి. దురదృష్టం.. పవన్ కళ్యాణ్ మారడంలేదంతే.! మైండ్ గేమ్ అనుకుంటున్నారుగానీ.. అది మెంటల్ గేమ్ అయిపోతోంది.