వైసీపీకి ఎంపీ సీట్లు 24-25.! వై నాట్ 175.?

వైసీపీ అంతర్గత సర్వేల్లోనే, 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతారని తేలుతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందనీ ‘ఐ ప్యాక్’ సర్వేలు చెబుతున్నాయి. కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మాత్రం వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

చిత్రమేంటంటే, ఈ సర్వేని వైసీపీ శ్రేణులే నమ్మడంలేదు. వైసీపీ అనుకూల మీడియానే ఈ ప్రచారంపై పెదవి విరుస్తోంది. వైసీపీ అనుకూల మీడియా అంటే, పలు వెబ్ సైట్లు అన్నమాట. వాటిని వైసీపీనే పెంచి పోషిస్తోంది.. ప్రభుత్వ, పార్టీ ప్రకటనలు ఇవ్వడం ద్వారా.!

సొంత సర్వేలన్నాక, వైసీపీ బాగు కోసం ప్రయత్నించాలి. వాస్తవానికి కాస్త ఎక్స్‌ట్రాలు జోడించి, మరింత సానుకూలతని సృష్టించాలి. అదే సమయంలో, చిన్నపాటి హెచ్చరికలూ వుండేలా చూసుకోవాలి. ఇదీ సొంత సర్వేలు వ్యవహరించాల్సిన తీరు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక, టైమ్స్ సంస్థకి 8 కోట్ల మేర లబ్ది చేకూర్చేలా ఓ డీల్ కుదుర్చుకుందనే ప్రచారం వుంది. ఆ డీల్ ఏంటంటే, ప్రభుత్వం తరఫున జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం. దానికిగాను, ఇలా ఈ సర్వేతో టైమ్స్ సంస్థ స్వామి భక్తి ప్రదర్శించిందని అనుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అనూహ్యంగా బలపడింది. జనసేన పార్టీ కూడా పుంజుకుంటోంది. టీడీపీ – జనసేన కలిస్తే, వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితే. చాలా సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ, 24 నుంచి 25 ఎంపీ సీట్లు వైసీపీకే.. అంటే, దానర్థమేంటి.?