“అవంతి” లో దూకుడు ఎందుకు తగ్గింది ?

Why did Avanti Srinivas become silent?

అవంతి శ్రీనివాస్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఎన్నికల ముందే పార్టీ మారినప్పటికీ కమ్యూనిటీ సహా వివిధ ఈక్వేషన్లు కలిసి రావడంతో అనూహ్యంగా కేబినెట్ ఛాన్స్‌ కొట్టారు. విశాఖజిల్లాలో ఏకైక మంత్రి కావడంతో తన హవాను చాటుకునేందుకు ప్రయత్నించారు అవంతి. పదవిలోకి వచ్చిన తర్వాత శాఖా పరమైన వ్యవహారాలకంటే రాజకీయ దూకుడుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

Why did Avanti Srinivas become silent?
Why did Avanti Srinivas become silent?

టీడీపీపై విరుచుకుపడ్డం ద్వారా వైసీపీ అధిష్ఠానం దగర మైలేజ్ సంపాదించేందుకు ప్రయత్నించారు అవంతి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన వేసిన కౌంటర్లు అనేకసార్లు రాజకీయ వేడిని రాజేశాయి. మంత్రి పేల్చే మాటల తూటాలు టీడీపీ పెద్దలకు నేరుగా తగులుతుండటంతో ఆ ఒరవడిని కొనసాగించింది వైసీపీ. మంత్రి సైతం ఆ స్పీడ్‍, జోష్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడేవారు. అయితే ఒకప్పటి మిత్రుడు.. ప్రస్తుత రాజకీయ ప్రత్యర్ధి గంటా శ్రీనివాసరావువైపు మాటల దాడిని మళ్లించారు అవంతి. మీడియా ముందైన.. బహిరంగ వేదికలపైనైనా గంటాపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా రాజకీయాలను రసకందాయంలో పడేసేందుకు ప్రయత్నించేవారు. దీంతో జిల్లా పూర్తిగా అవంతి గ్రిప్‌లోకి వచ్చేసిందనే భావన సొంతపార్టీలోనే కనిపించింది.

జిల్లా రాజకీయాల్లో అవంతి హవా కొనసాగుతుందని భావిస్తుండగా.. ఒక్కసారిగా అంతా మారిపోయింది. ప్రస్తుతం మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ వ్యవహారాలు భీమిలికే పరిమితం. కోవిడ్ తర్వాత ఆయన ఫోకస్ అంతా నియోజకవర్గంపైనే ఉంది. అధికారులతో రివ్యూలు, విస్తృత సమావేశాలు అడపాదడపానే జరుగుతున్నాయి. అన్నింటికీ మించి టీడీపీ అధినేత చంద్రబాబుపైన అవంతి విమర్శలు ధాటి తగ్గిందనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ప్రతిపక్షనాయకుణ్ణి కడిగేయడానికి ఉత్సాహం ప్రదర్శించే మంత్రి ఇప్పుడు నిర్మాణాత్మక విమర్శలకు పరిమితం అవుతున్నారనే చర్చ జరుగుతోంది. అమరావతి, రెఫరెండం వంటి హాట్ హాట్ పొలిటికల్ ఇష్యూస్‌లోనూ ఆయన ధోరణి మారిందనేది మాటలను బట్టి తెలుస్తోంది. రొటీన్ వ్యాఖ్యలు, విమర్శలు తప్ప పంచ్‌లు మిస్సయ్యాయి.