పుష్ప శ్రీవాణి మౌనం గురించి తాడేపల్లి లో హాట్ టాపిక్..??

దాదాపు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విటర్ లకే పరిమితం అవుతారు. కానీ రాజకీయ నాయకులందరికి భిన్నంగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి మాత్రం టిక్ టాక్ లో తన హవాను చూపించింది. తాను చేసిన టిక్ టాక్స్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువ అయ్యారు. వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. చాలా చిన్న వయసులోనే పెద్ద పదవిని సొంతం చేసుకున్న పుష్పా, సీఎం జగన్మోహన్ రెడ్డి తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


ముఖ్యమంత్రి మీదా.. ప్రభుత్వం మీద ఎవరు పల్లెత్తు మాట అన్నా కస్సుమనేవారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు దీంతో.. ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తొందరగానే వచ్చేసింది.

మాటలతో తరచూ వార్తల్లోకి ఎక్కటమే కాదు.. ఆమెకంటూ గుర్తింపును సొంతం చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు అలాంటి ఆమె.. గడిచిన కొన్ని వారాలుగా మౌనంగా ఉండటం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. గత కొన్ని రోజుల నుండి పుష్పా చాలా మౌనంగా ఉంటున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కూడా ఆమె పట్టించుకోవడం లేదు. జగన్ ను ఇన్ని మాటలను అంటున్నా కూడా పుష్పా ఎందుకు స్పందించడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత వేరే ప్లాట్ఫామ్స్ లలో కూడా తన వీడియోస్ ను అప్లోడ్ చేయడం లేదు. మీడియాలో కూడా ఆమె పెద్దగా కనిపించడం లేదు. మూడు రాజధానుల అంశంపై కూడా పుష్పా ఇప్పటి వరకు స్పందించలేదు. కోర్ట్ ల్లో, ప్రతిపక్షాలలో ప్రభుత్వానికి ఇన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్పా స్పందించకపోవడం వైసీపీ నాయకులకు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రానున్న రోజుల్లోనైన పుష్పా మాట్లాడుతారో లేదో చూడాలి. లేక ఇలా మౌనంగా ఉండటం వెనక కూడా ఏదైనా రాజకీయ వ్యూహం ఉందొ వేచి చూడాలి.