ఏపీ లో ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి , ఏపీ ప్రజలు ఎవరికీ పట్టం కడతారు అనే విషయం పై “వే టు న్యూస్” అనే సంస్థ తాజాగా ఓ సర్వే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది వద్ద సర్వే చేసి ఫలితాలు రాబట్టింది. వచ్చిన ఫలితాలు చూస్తే .. ఏపీ లో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే 48 శాతం మంది ప్రజలు వైసీపీ పార్టీకి జై కొట్టగా, 35 శాతం ప్రజలు టీడీపీకి జై కొట్టారు. కానీ అనూహ్యంగా జనసేన- బిజెపి కూటమికి 12 శాతం మంది ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇతరులకు వచ్చేసరికి ఐదు శాతం.
ఈ సర్వే లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్ర వాసుల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. గతసారి 51 శాతం ఓట్లు రావటం ఇప్పుడు తగ్గటమే దానికి నిదర్శనమని చెప్పవచ్చు. టిడిపి పార్టీ పరిస్థితి అయితే మరీ డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 40 శాతం ఓట్లు రాబట్టగా ఇప్పుడు ఐదు శాతానికి తగ్గి, 35 శాతం కి పడిపోయిన పరిస్థితి. అధికార ప్రతిపక్ష పార్టీ పరిస్థితి అలా ఉంటే, రాష్ట్రంలో తృతీయ కూటమి అయిన బీజేపీ- జనసేన కి ఊహించని విధంగా పెరగటంతో ఏపీ ప్రజల ఆలోచనలో మార్పు వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఉంటే ఏపీ పొలిటికల్ ముఖచిత్రం మారే అవకాశం ఉందని టిడిపి ప్లేస్ జనసేన బిజెపి రీప్లేస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా జగన్ ఓటు బ్యాంకు కూడా తగ్గే పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు.