ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలుతో బలమైన నాయకుడిగా అవతరిస్తున్నాడు. పాలన పరంగా జగన్ మోహన్ రెడ్డిని ఢికొట్టే సత్తా ప్రతిపక్షాలకు లేకపోవడంతో కులం రూపంలోనో? మరో రూపంలోనో? జగన్ మోహన్ రెడ్డిపై విపరీతమైన వ్యతిరేకతను తీసుకురావాలని ఏపీలో ఉన్న అన్ని పార్టీలు కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నాయి. రాష్ర్టంలో జరుగుతోన్న ప్రతీ అంశాన్ని వివాదాస్పదంగా మారుస్తూ జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ కిందా? మీదా? పడి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు సాక్ష్యాలు టీడీపీ నేతల ఏడాది కాలంలో చేసిన వ్యాఖ్యలు. పచ్చ కథనాలు.
నేరుగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్ని టార్గెట్ చేయలేక! రాష్ర్టంలో ఇతర విషయాల్ని రాజకీయాల్ని చేస్తూ టీడీపీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇక 2024 లో మిత్రపక్షం బీజేపీతో కలిసి జనసేన ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీరియస్ ప్రయత్నాల్లో ఉంది. దీనిలో భాగంగా బీజేపీ జనసేనను రాజకీయంగానే వాడుకుంటుందా? అన్న అనుమానం రాక మానదు. ఎలాగైనా టీడీపీని పడగొట్టి రెండవ స్థానంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత కాలం అధికారం అన్నది అంత సులభం కాదు. టీడీపీని పడగొడితే 2024 కి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని బీజేపీ పాకులాడుతోంది.
ఇక జనసేన ఎలాగైనా తన బలంతో 2024 లో అధికారంలోకి రావాలని ప్రయత్నాలైతే చేస్తుంది గానీ అది ఎంత వరకూ సక్సెస్ అవుతుంది అన్నది తేల్చలేం. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వెనుక ఒక్కో వర్గం ఉంది. అయితే ఇప్పుడీ అన్నీ పార్టీల ముందున్న టార్గెట్ జగన్ ని జనాల్లో బలహీన పరచడం. అందుకోసం రాష్ర్టంలో తాజా పరిస్థితులకు కుల మంతాల రంగు పూసి జగన్ పై మసి పూసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయన్నది సుస్పష్టం. వైఎస్సార్ హయాంలోనూ అప్పటి ప్రతపక్షం ఇలాంటి మంతం రంగును అంటించే ప్రయత్నం చేసింది. కానీ నిస్వార్ధ నాయకుడు ముందు, మహానేత ముందు ఆ పార్టీ పప్పులుడకలేదు. మరి బెస్ట్ సీఎంగా కీర్తింబడుతోన్న జగన్ ముందు ఈ ఆట ల సక్సెస్ రేటు ఎంత? అన్నది తేలాల్సి ఉంది.