ఆయనో వైసీపీ కీలక నేత. ఉత్తరాంధ్రకు చెందిన ‘పెద్దాయన’ కూడా.! వైసీపీలో కీలక నేతగా, కీలక బాధ్యతల్లోనూ వున్నారు. ‘డాన్’ అని కూడా ఆయన మీద తరచూ రాజకీయాల్లో విమర్శలు వినిపిస్తుంటాయి. పైగా, ‘లిక్కర్’ విషయంలోనే ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయ్. మాట కొంచెం తేడా.!
సదరు వైసీపీ నేత తన సతీమణికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనే ఆలోచనలో ఆయన వున్నారట. అంటే, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఇకపై ఆయనకు లేదట. తన వారసుల్ని రంగంలోకి దించుతారట. అదే సమయంలో, ఏదో ఒక నామినేటెడ్ పోస్టులో వుండాలనుకుంటున్నారట.. అది చట్ట సభలకు సంబంధించినదైతే ఇంకా మంచిదని అనుకుంటున్నారట.
భార్యకు ఎంపీ టిక్కెట్ వైసీపీ నుంచి కాదట, బీజేపీ నుంచి అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోనే వున్నారు. కాలం కలిసి రాక, రాజకీయాలకు దూరమవ్వాల్సి వచ్చిందామె.
తెరవెనుకాల సదరు వైసీపీ నేత ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో, బీజేపీనే వ్యూహాత్మకంగా ఆ విషయాన్ని లీక్ చేసి, సదరు వైసీపీ నేత బండారాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించిందన్న వాదనలూ లేకపోలేదు. విషయం ముందే వైసీపీ అధినాయకత్వానికి తెలిసినా, ఆయనకున్న సీనియార్టీ.. సామాజిక వర్గం తాలూకు బలం.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఉపేక్షిస్తున్నారట వైసీపీ అధినేత.
గతంలో వేరే పార్టీలో వుండి, వైసీపీ మీద నానా రకాల విమర్శలు చేశారాయన. వైసీపీలోకి వచ్చాక, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దేవుడంటున్నారు. రేప్పొద్దున్న ఆయన అనుకున్నవన్నీ బీజేపీ ద్వారా జరిగిగితే, అప్పుడు మళ్ళీ వైఎస్ జగన్‌ని దెయ్యమని విమర్శించేందుకూ ఆయన వెనుకాడబోరు.