నిన్న చంద్రబాబు అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేసిన కియా మోటార్స్ కంపెనీలో తయారైందని చెబుతున్న కారును స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ కంపెనీని ఆంధ్రాకు, అందునా అనంతపురానికితెచ్చేందుకు తాను ఎంత కష్టపడింది చెప్పారు. తెలుగుదేశం చపట్లుకొట్టారు. అయతే, వాస్తవం. ఫ్యాకర్టీ అనంతపురం రావడం సంతోషకరమయిన వార్తే. కాదనలేం. అయితే, చంద్రబాబు మొత్తం క్రెడిట్ ను తన అకౌంటు లో వేసుకోవడం పెద్ద జోక్. దీనికి ప్రధాని మోదీ కృషి ఉందని దక్షిణ కొరియా మీడియే రాస్తున్నది.
అనంతపురం లో ఈ ప్లాంటు ఏర్పాటు చేయాలన్న విషయం ఎపుడో ప్రధాన మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లినపుడే చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని బిజినెస్ కొరియా రాసింది కూడా ఇదిగో లింక్.
http://www.businesskorea.co.kr/news/articleView.html?idxno=17622
2015 లో ప్రధాని మోదీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారువెళ్లారు అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ , హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు. పెట్టుబడుల గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని అభిలాష వ్యక్తం చేశారు .హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్నందున దీనిని కూడా అక్కడే ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లు ప్రస్తావించారు.
దానికి ప్రధాని మోదీ వెంటనే స్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో ఎందుకు ఏర్పాటుచేయరాదని అన్నారు. ఆంధ్రా అయితే అయితే బాగుంటుంది తమిళనాడు కూడా పొరుగునే ఉంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని మాట కూడ ఇచ్చారు. తర్వాత
ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కియా మోటార్స్ ను కేటాయించారు.
ఈ విషయం పాపం లోకేష్ అప్పట్లోనే కన్ఫర్మ్ చేసి అదరగొట్టారు.
ప్రధాని సూచనను కాదని హ్యుందాయ్ లాటి సంస్థ కాదంటుందా?