అట్టర్ ప్లాప్ అయిపోయిన ‘ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ‘ – చంద్రబాబు కి బిగ్ షాక్ !

అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పటికే 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ యొక్క పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. పార్టీ ఈ స్థితికి చేరుకుంటుందని చంద్రబాబు నాయుడు కలలో కూడా ఊహించి ఉండడు. టీడీపీ నుండి గెలిచిన వాళ్లలో కూడా కొంతమంది వైసీపీ వైపు వెళ్తున్నారు. అలాగే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి పార్టీలోని సీనియర్స్ కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
Nara Chandra Babu Naidu
టీడీపీని దెబ్బ తీసిన బీజేపీ

2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు బీజేపీని, బీజేపీ నాయకులను అస్సలు పట్టించుకోలేదు. దింతో బాబుపై కోపం పెంచుకున్న బీజేపీ నేతలు అప్పటి నుండి టీడీపీని దెబ్బకొట్టడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీని సపోర్ట్ చేస్తూ టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టారు.అలాగే ఇప్పుడు అమరావతిలో అక్రమాలు జరిగాయని కూడా బీజేపీ నేతలు బాబుపై నిందలు మోపుతున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు యొక్క కలల రాజధానిని కుడా మంట కలిపారు.

దెబ్బకొట్టిన బీజేపీతో కలవడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు

టీడీపీని బీజేపీ అడుగడున దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల తరువాత కూడా బీజేపీతో కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.అవకాశం వచ్చిన ప్రతిసారి బీజేపీని, మోడీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. బీజేపీ నాయకులైన అమిత్ షా, నరేంద్ర మోడీలు మాత్రం బాబును అస్సలు పట్టించుకోవడం లేదు. బీజేపీతో కలిసి ఏపీలో వైసీపీ దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ చంద్రబాబు యొక్క 40 ఏళ్ల రాజకీయ అనుభవం బీజేపీ ముందు పని చేయడం లేదు.