ఏపీ రాజకీయాలు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఎవరు ఏ వ్యూహం పన్నుతున్నారో ఎవరు ఏ వ్యూహంలో చిక్కుకుంటారో ఎవరికి తెలియడం లేదు. ఇప్పుడు ఏపీలో బీజేపీ వేసిన వ్యూహానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా వంత పలుకుతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తమను పక్కన పెట్టాడని భావిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు జగన్ తో కలిసి టీడీపీని అంతం చేయడానికి పథకం రచించారు.
బీజేపీ వేసిన పథకం ఏంటి?
అమరావతిని రాజధానిగా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అలాగే అప్పుడు అమరావతి అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని కూడా మోడీ చెప్పారు . అయితే తరువాత కాలంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కానీ బీజేపీ నేతలను కానీ పట్టించుకోలేదు. అమరావతిలో చంద్రబాబు నాయుడు తన హవాను కొనసాగించారు. ఈ విషయంలో హర్ట్ అయిన బీజేపీ నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉపయోగించి చంద్రబాబు నాయుడుని దెబ్బతీయడానికి పథకం రచించింది. జగన్ అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలలకే రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ నూతన వ్యూహానికి తెర లేపారు. జగన్ తీసుకున్న ఈ అనూహ్యమైన నిర్ణయం వెనుక బీజేపీ కూడా ఉందని అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్న పనులు ఆ ప్రచారం నిజమని ప్రూవ్ చేస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో తాము ఏమి చేయలేమని కోర్ట్ లో చెప్తూ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబును దెబ్బతీయడానికి జగన్ కూడా బీజేపీ నేతలకు తల ఆడిస్తున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలా తనకు రాజకీయంగా మద్దతు ఇస్తున్న జగన్ ను రానున్న ఎన్నికల్లో ప్రధాని మోడీనే జగన్ ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తారని రాజకీయ పండితులు చెప్తున్నారు.
బాబుకు ఈ విషయం తెలుసా!
మూడు రాజధానుల విషయం వెనక బీజేపీ హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా తెల్సు. కానీ బీజేపీని ఏమి అనలేరు, ఎందుకంటే అమరావతిలో ఆయన చేసిన అక్రమాలన్ని బీజేపీ తెలుసు కాబట్టి. ఇలా తాను చేసిన తప్పులే ఇప్పుడు తనను ఇబ్బందుల్లో పడేశాయి. ఒకవేళ జగన్ మూడు రాజధానుల నిర్మాణం ప్రారంభం అయ్యి, అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తే ప్రజల్లో వచ్చే ఆధరణతో చంద్రబాబును చావుదెబ్బ కొట్టనున్నారు.