సంచలనం: జగన్ ఏదైతే చెప్పారో అదే జరిగింది.

ఏపీ ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ చెప్పిందే నిజమని స్పష్టమైంది. ఏదైనా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే ఆర్ధిక సంఘం అనుమతి అవసరం లేదు. అసలు హోదా అంశం ఆర్ధిక సంఘం పరిధిలోనిది కాదు. పీఎం సిగ్నేచర్ తో ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయవచ్చని ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పలుమార్లు వెల్లడించారు. ఇది వాస్తవమని గురువారం అమరావతిలో 15 వ ఆర్ధిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్ చేసిన ప్రకటనతో స్పష్టమైంది. ప్రత్యేక హోదాతో మాకు ఎలాంటి సంబంధం లేదని నందకిషోర్ వెల్లడించారు.

ప్రత్యేక హోదా విషయం పూర్తిగా జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోకి వస్తుందని, అమలు చేసే బాధ్యత ప్లానింగ్ కమిషన్ కి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదాను అడ్డుకుందని చెప్పడం కూడా అవాస్తవం అన్నారు. ఆయన మరో విషయం కూడా వెల్లడించారు. అసలు 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేకహోదా అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది అని తాను భావించట్లేదని ఆయన మీడియా ఎదుట తెలిపారు. నందకిషోర్ సింగ్ మీడియా సమావేశం కంటే ముందు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేకహోదా విషయంలో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

రాష్ట్ర విభజన చట్టం ఆమోదించేటప్పుడు నేను కూడా రాజ్యసభలోనే ఉన్నాను. అప్పుడు నేను చప్పట్లు కొట్టాను, నాతోపాటు ప్రస్తుత కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా చప్పట్లు కొట్టారని నందకిషోర్ చెప్పారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు విభజన హామీల అమలుకు ఒక వ్యవస్థీకృతమైన పర్యవేక్షక యంత్రాంగం ఉండేదని తెలిపారు. ఏపీ విషయంలో అలాంటిదాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది ఉంటే విభజన సమయంలోనే ఇచ్చి ఉండాలని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ధిక సంఘం ప్రమేయం ఈ విషయంలో అవసరం లేదని తేల్చి చెప్పారు. అసలు స్పెషల్ స్టేట్స్ అంశం ఆర్ధిక సంఘం పరిధిలోని అధ్యయన, పరిశీలనాంశాల్లోకి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, పాక్షికంగా కానీ, కనీసం సుదూరం నుండి కూడా ప్రభావితం చేసే విధంగా కానీ ఉండదని వెల్లడించారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్ కి, చంద్రబాబుకు మధ్య 2017 మార్చి 17 న జరిగిన మాటలయుద్ధం కింద క్లిప్పింగ్ లో చూడండి.