ఏపీలో కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేయడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో కొందరు టీడీపీ నేతలు సదరు చానల్స్ కి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా ఒక ఛానల్ ప్రసారాన్ని నిలిపివేయడంపై వెళ్లి గవర్నర్ ని టీడీపీ నేతల బృందం కలిసి దీనిపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఆలపాటి రాజా మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఉన్న ఎన్నికల సంఘం పై ప్రభుత్వం తీరు సరి కాదు అని అన్నారు. సుప్రీం కోర్టు ఎన్నికలు నిర్వహించాలని చెప్పినా జగన్ బ్యాచ్ కి బుద్ధి రాలేదు అని మండిపడ్డారు.
రాజ్యాంగ బద్దంగా పని చేయాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘానికి సహకరించడం..విధి అని ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎన్నికల కమీషనర్ పై నోటికి వచ్చిన విధంగా మాట్లాడతారా అని నిలదీశారు. మీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ స్పందించరు అని ఆయన ఆరోపించారు. అందుకే ఈరోజు గవర్నర్ కు ఫిర్యాదు చేశాం అని అన్నారు.
ట్రాయ్ ఆదేశాలు ఉన్నా… ఈ ప్రభుత్వం దుర్మార్గంతో వ్యవహరిస్తుంది అని ఆయన మండిపడ్డారు. ఎంతమంది గొంతులు నొక్కుతారో.. మీ అక్రమాలు సాగిస్తారో చూస్తాం అన్నారు ఆయన. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చూపించకుండా డ్రామాలు ఆడుతుంది అని ఆయన పేర్కొన్నారు. పాలకులే దొంగలుగా మారిన వైనం ఎపిలోనే చూస్తున్నాం అని అన్నారు. కేబుల్ ఆపరేటర్ ల పై ఒత్తిడి తెచ్చి దొంగతనంగా ప్రసారాలు ఆపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. .