జనసేనతో కలిసి నడుస్తాం -సిపిఐ

విజయవాడలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మహాగర్జన సభ జరుగుతోంది. రైల్వే స్టేషన్ నుండి బీఆర్టీఎస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లెఫ్ట్ పార్టీల అగ్ర నేతలు పాల్గొన్నారు. 13 జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలతో రహదారులన్నీ ఎరుపెక్కాయి. వేల సంఖ్యలో ఈ మహాగర్జనకు ప్రజలు హాజరయ్యారు. ఈ సభలోనే తమ ఎజెండాను ప్రజలకు తెలుపనున్నారు కమ్యూనిస్టు పార్టీ నేతలు.

సిపిఐ అగ్రనేతలు మాట్లాడుతూ నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదికకు నాంది పలికాం అన్నారు. జనసేన కూడా మాతో కలిసి రానుంది అని తెలిపారు. విధాన పరంగా జగన్ కు, చంద్రబాబుకు తేడా లేదు అన్నారు. ఏపీలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో కలిసి ముందుకు వెళ్తాము అని వెల్లడించారు.