ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి సందర్భంలో మోదీ సర్కార్ ను సపోర్ట్ చేస్తున్నారే తప్ప మోదీ సర్కార్ పై విమర్శలు చేయడం లేదనే సంగతి తెలిసిందే. కేంద్రంపై విమర్శలు చేసే ఛాన్స్ వచ్చినా జగన్ మాత్రం ఆ ఛాన్స్ ను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. కేంద్రంకు అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని వైసీపీ సర్కార్ భావిస్తోంది. కేంద్రం ఏపీ అప్పుల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడానికి జగన్ ప్రవర్తనే కారణమని చెప్పవచ్చు.
అయితే తాజాగా జగన్ మాట్లాడుతూ పోలవరం ఆర్.అండ్.ఆర్ ప్యాకేజ్ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని చెప్పుకొచ్చారు. చింతూరులో జగన్ మాట్లాడుతూ నిధుల విడుదల కొరకు తరచూ కేంద్రానికి లేఖలు పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్ట్ లో నీళ్లు నింపుతామని జగన్ వెల్లడించారు.
నాలుగు ముంపు మండలాలను ప్రత్యేక డివిజన్ చేస్తున్నామని ఇందుకు సంబంధించి ఆమోద ముద్ర కూడా వేశామని జగన్ చెప్పుకొచ్చారు. పోలవరంకు రాష్ట్రం తరపున 20,000 కోట్ల రూపాయలు ఖర్చైందని జగన్ పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించిన నిధుల కోసం కేంద్రంతో యుద్ధాలు చేస్తున్నామని జగన్ అన్నారు. ఏపీ తరపున 20,000 కోట్ల రూపాయలు ఖర్చైందని కేంద్రం నుంచి ఆ మొత్తం రావాల్సి ఉందని జగన్ చెప్పుకొచ్చారు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తైనా మొదట డ్యామ్ సగం వరకు మాత్రమే నీళ్లు నింపుతామని జగన్ పేర్కొన్నారు. మూడేళ్లలో నీరు పూర్తిగా నింపేస్తామని జగన్ కామెంట్లు చేశారు. అయితే కేంద్రంపై యుద్ధం అంటూ జగన్ చేసిన కామెంట్లు సిల్లీగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జగన్ కేంద్రంను డిమాండ్ చేయడం, కేంద్రానికి వ్యతిరేకం