ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఈ వ్యవస్థ వల్ల లాభమా? నష్టమా? అనే విషయాన్ని పక్కన పెడితే ఈ వ్యవస్థ వల్ల అధికార పార్టీ రాజకీయ నేతల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వాలంటీర్ వ్యవస్థ వల్ల తమ పరువు పోతుందని సర్పంచ్ లు సైతం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లే ప్రభుత్వ పథాకాలు ఇస్తున్నారని కొంతమంది భావిస్తున్నారు.
వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని జగన్ భావించడం వల్లే కొత్తగా గృహ సారథుల నియామకం జరుగుతోందని సమాచారం అందుతోంది. వాలంటీర్లకు వేతనాలు పెంచితే మాత్రం ఈ ఉద్యోగాలకు కూడా ఊహించని స్థాయిలో పోటీ ఏర్పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వాలంటీర్లకు వేతనం10 వేలకు పెంచితే బాగుంటుందని డిమాండ్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
జగన్ నిజంగా 10000 రూపాయలకు వేతనం పెంచితే మాత్రం జగన్ పార్టీకి వాలంటీర్లు మరింత అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని వాలంటీర్లు ప్రస్తుతం తమ వేతనాలకు సంబంధించిన శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాలంటీర్లకు మరింత బెనిఫిట్ కలిగేలా సీఎం జగన్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.
ఏపీలోని వాలంటీర్లలో చాలామంది ఈ ఉద్యోగాన్ని పార్ట్ టైమ్ జాబ్ లా ఫీలవుతున్నారు. జగన్ వల్లే తమకు బెనిఫిట్ కలుగుతోందని భావిస్తున్నారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. వాలంటీర్లకు బెనిఫిట్ కలిగేలా జగన్ సర్కార్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.