ఏపీ రాజకీయాల్లో విశాఖ లోక్ సభ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ గెలవాలని, ఈ టిక్కెట్ గెలిస్తే అధికారంలోకి వస్తారని కొంతమంది సెంటిమెంట్ మాటలు కూడా చెబుతుంటారు 2004, 2009, 2014, 2019ని అందుకు ఉదాహరణగా చూపిస్తుంటారు. ఈ సమయంలో కీలకమైన ఈ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలోకి దిగుతుండగా.. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తీక్రమైన విషయం తెరపైకి వచ్చింది.
అవును… విశాఖలో మంత్రి బొత్సా సత్యనారాయాణ సతీమణికి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు జగన్. కూటమిలో భాగంగా ఈ టిక్కెట్ బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకి వస్తాదనే ప్రచారం జరిగింది. అదే జరిగితే వైసీపీకి కాస్త కష్టమయ్యేదనే కామెంట్లూ వినిపించేవి. అయితే ఊహించని రీతిలో, బాబు మ్యాజిక్ లో భాగంగా ఈ టిక్కెట్ బాలయ్య అల్లుడు భరత్ కి దక్కింది. దీంతో… వైసీపీ కాస్త ధీమాగా ఉందని చెబుతున్నారు. పైగా బీసీల ప్రిస్టేజ్ ఇష్యూగా విశాఖ లోక్ సభ స్థానం మారిందనే చర్చ తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే… బొత్సా ఝాన్సీకి వైసీపీ ఎంపీ టిక్కెట్ దక్కింది. దీంతో… తాను స్థానికురాలిని అని, విశాఖ ఆడపడుచుని అని, తనను గెలిపించాలని అంటుంది. ఆమె విద్యావంతురాలే కాకుండా సౌమ్యురాలు అవ్వడంతోపాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం ఇప్పుడు ఆమెకు మరింత ప్లస్ అయ్యిందని అంటున్నారు. కారణం ఇక్కడ కొన్ని దశాబ్ధాలుగా ఓసీలు.. అందులోనూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే రాజ్యమేలుతున్నారనే అభిప్రాయం స్థానికంగా బలంగా ఉండటమే నట.
మరోపక్క కూటమిలో భాగంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న భరత్ గత ఎన్నికల్లోనూ పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. దీంతో… ఈసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బీజేపీ నుంచి భరత్ కు జీవీఎల్ వర్గం రూపంలో మద్దతు లభించకపోవచ్చనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త సమస్యగానే ఉందని అంటున్నారు. మరోపక్క కమ్మ సామాజికవర్గమే ఇక్కడ గెలుస్తుందని ఆయన ఫాలోవర్స్ చేబుతున్నారని తెలుస్తుంది.
దీంతో విశాఖ లోక్ సభ స్థానంలో ఇప్పుడు బీసీ వర్సెస్ కమ్మ అనే చర్చ స్థానికంగా తెరపైకి వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి పార్టీలు ఏవైనా కానీ.. ఇక్క్డ ఎప్పుడూ కమ్మ సామాజీవర్గానికి చెందిన నేతలే గెలుస్తున్నారు. దీంతో… ఈసారి జగన్ బీసీ మహిళకు టిక్కెట్ కేటాయించారు. కంచుకోటలు, కుంభస్థలాలు అనే మాటలు చెల్లుచీటీ రాయాలని భావిస్తున్నారని అంటున్నారు. దశబ్ధాలుగా ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కాకుండా… బీసీలకూ అవకాశాలివ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది.
2004లో కాంగ్రెస్ నుంచి ఎన్. జనార్ధన్ రెడ్డి ఎంపీగా గెలిచారు. అప్పుడు ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009 విశాఖ ఎంపీగా కాంగ్రెస్ తరఫున దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ ఎంపీ అయ్యారు. అప్పుడు కూడా వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలొకి వచ్చింది! 2014లో బీజేపీ తరఫున కె హరిబాబు గెలిచారు. అప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ-టీడీపీలు అధికారంలోకి వచ్చాయి. 2019లో వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.
అయితే… గత మూడు దఫాలుగా గెలుస్తున్న వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో… ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీలు విశాఖ ఎంపీగా గెలవాలని వారంతా పట్టుబడుతున్నారని తెలుస్తుంది. పైగా విశాఖ లోక్ సభ పరిధిలో బీసీలు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. దీంతో.. ఈసారి వారి కోరిక నెరవేరే అవకాశాలపై వైసీపీ ఆశలు పెట్టుకుందని తెలుస్తుంది. మరి బీసీ వర్సెస్ కమ్మ అన్నట్లుగా చెబుతున్న విశాఖ ఎంపీ పోరులో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనేది వేచి చూడాలి.