ప్రస్తుతానికి ముగ్గురు… పురందేశ్వరి భుజంపై బాబు తుపాకీ సక్సెస్!

ఏపీ బీజేపీలో రెండు రకాల నేతలు ఉంటారని చెబుతుంటారు. వారిలో చంద్రబాబుకు భజన చేస్తూ, పసుపు రంగు పూసుకున్న కాషాయ దళం ఒకరు కాగా… ఒరిజినల్ కాషాయ నేతలు మరొకరని అంటుంటారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో పొత్తులో ఉన్నప్పటికీ 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కేటాయించడంలో చంద్రబాబు తలమునకలవుతున్నారని అంటున్నారు.

అవును… పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా.. 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన.. 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అయితే ఇది అధికారిక లెక్కలు మాత్రమే అని… 175 + 25 స్థానాల్లోనూ చంద్రబాబే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని.. దీనికోసం బీజేపీలో పురందేశ్వరి సహాయం తీసుకంటునారని.. జనసేన గురించి చెప్పే పనే లేదని అంటున్నారు పరిశీలకులు.

వివరాళ్లోకి వెళ్తే… తాజాగా బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు వారు కోరుకున్న స్థానాలు, గత చాలా కాలంగా పనిచేసుకుంటున్న స్థానాల్లో టిక్కెట్లు దక్కలేదు. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పైగా… ఈ లిస్ట్ ను రాసి పైకి పంపించేది పురందేశ్వరి అయినప్పటికీ… ఆమె భుజం మీద తుపాకీ పెట్టి… బీజేపీలోని ఒరిజినల్ బీజేపీ నేతలను చంద్రబాబు కాలుస్తున్నారనే కామెంట్లు చేస్తున్నారు!! ఈ విషయంలో పురందేశ్వరి ప్లాన్స్ కూడా వర్కవుట్ అవుతున్నాయని చెబుతున్నారు.

తాజాగా చంద్రబాబు 13లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా… విశాఖ ఎంపీ స్థానన్ని బాలకృష్ణ అల్లుడు గీతం భరత్ కు కేటాయించారు. దీంతో.. ఈ ఒక్క విషయం చాలు బీజేపీ సీట్లను చంద్రబాబు – పురందేశ్వరి కలిసి ఎంపిక చేస్తున్నారని.. ఫలితంగా పురందేశ్వరికి స్వామికార్యం, స్వకార్యం కూడా నెరవేరిపోతుందని చెబుతున్నారు.

కారణం… రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేంద్రమంత్రులు అయ్యే వారిలో పురందేశ్వరికి ఫస్ట్ అడ్డోచ్చే పేరు జీవీఎల్ నరసింహారావు! ఇక వియ్యంకుడు బాలయ్య కోసం అయినా తన చిన్నల్లుడు భరత్ కి టిక్కెట్ ఇవ్వడం బాబుకు ముఖ్యం. ఫలితంగా ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి నిశ్వార్ధంగా, కష్టపడి పనిచేస్తున్నారనే పేరున్న జీవీఎల్ నరసింహరావు బలి!! దీంతో… విశాఖలో భరత్ ఎలా గెలుస్తారో చూస్తామంటూ బీజేపీ కార్యకర్తలు, జీవీఎల్ అభిమానులు భీష్మించుకుని కుర్చున్నారని తెలుస్తుంది!

ఇదే సమయంలో… ఏలూరు లోక్ సభ స్థానంపై బీజేపీ సీనియర్ నేత గారపాటి చౌదరి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. పార్టీ కోశం ఎంతో ఖర్చుపెట్టుకున్నట్లు చెబుతున్నారు! ఈ సమయంలో ఆయనకూ నిరాశే ఎదురైంది. ఆయన ఆశించిన ఏలూరు ఎంపీ స్థానాన్ని యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కి ఇచ్చారు చంద్రబాబు! ఇదే సమయంలో… హిందూపూర్ స్థానాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆశించగా.. ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి ప్రకటించారు.

మరి ఈ విషయంలో ఇప్పటికైనా ఏపీ బీజేపీ ఒరిజినల్ నేతలు గట్టిగా నిలబడతారా.. కేంద్రంలోని పెద్దల కళ్లు తెరిపిస్తారా.. లేక దేవదాసులైపోయి చూస్తూ ఉంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… చంద్రబాబు & కో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజలు గ్రహించలేరని భావిస్తే… ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు!