వైరల్ : నారా లోకేష్ బాలయ్యకి ఏ రేంజ్ లో చెప్పిన విషెష్ చెప్పాడో చూసారా?

టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు తెలుగు దేశం పార్టీ కీలక ఎమ్మెల్యే నట సార్వభౌమ  తారక రామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ ఇపుడు తన రాజకీయాలు అలాగే సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య పుట్టినరోజు ఈరోజు కాగా ఇండస్ట్రీ వర్గాలు మరియు రాజకీయ పార్టీల ప్రముఖులు నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే ఇదిలా ఉండగా బాలయ్యకి తన అల్లుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలియజేసాడు. అయితే ఈ విషెష్ మాత్రం నందమూరి నారా అభిమానులకి ఓ రేంజ్ లో కిక్ ఇస్తుంది. మరి అంతలా తాను ఏం చెప్పాడంటే.. 

నిజాయితీ, నిరాడంబరత, ముక్కు సూటితనం, కష్టపడే తత్వం, అన్నిటికి మించి గోల్డెన్ హార్ట్ అయినటువంటి నా బాల మావయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మీ కలలు అన్నీ సాకారం అవ్వాలని కోరుకుంటున్నట్టు నారా లోకేష్ తెలిపాడు. దీనితో ఈ లోకేష్ ఈ రేంజ్ లో ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.