స్వైన్ ఫ్లూ అని ఈ కృష్ణా జిల్లా గ్రామాన్ని వెలివేస్తున్నారు

కృష్ణాజిల్లా కోడూరు మండలం చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య(45) 3 రోజుల క్రితం స్వైన్ ఫ్లూ తో మృతి చెందాడు.

అదే గ్రామానికి చెందిన పేరే మరియమ్మ(32) కూడా 5 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మృతి చెందింది. దీనితో

స్వైన్ ఫ్లూ వైరస్ చింతకోళ్ల గ్రామం అంతటా వ్యాపించిందని, ఇది గ్రామానికి ముప్పు అని  పుకార్లు మొదలయ్యాయి. ఈ దెబ్బతో పరిసర గ్రామాల ప్రజలు  చింతకోళ్ల వాసులను కలవడం  వారితో  మాట్లాడటం మానేశారు.

వ్యాధి భయంతో ప్రవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అనధికారిక సెలవులు ప్రకటించాయి,  ఆ గ్రామానికి స్కూల్ బస్సులు రావని, కొన్నిరోజుల వరకు పాఠశాలకు రావద్దని స్వయాన స్కూల్ ప్రిన్సిపాల్ చెబుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

గ్రామానికి పాలు పోయాడానికి వచ్చేవారు కూడా పాల సరఫరా నిలిపివేశారు.

హోటల్ లో టిఫిన్ కోసం వెళితే హోటల్ కి రావద్దు అని హోటల్ సిబ్బంది బయటకు పంపేస్తున్నారని గ్రామస్థులు అరోపిస్తున్నారు.

మంచినీటి కోసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపాకల గ్రామానికి వెళ్తుంటే మా గ్రామానికి రావద్దని చెప్తున్న రట.

పక్కనే ఉన్న ఇరాలి గ్రామంలో చింతకోళ్లకు వెళ్లవద్దు అంటూ మైకు ద్వారా ప్రచారం నిర్వహించినట్లు సమాచారం.

RTC బస్సుల నుండి చింతకోళ్ల గ్రామ ప్రజలు దిగిపోవాలని  తోటి ప్రయాణికులు గొడవ చేస్తున్నారని తెలిసింది.

స్వైన్ ఫ్లూ అనుమానంతో చింతకోళ్ల గ్రామ ప్రజలు అన్ని విధాల సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారని వార్తలొస్తున్నాయి.