మోడీతో వైఎస్ జగన్ మీటింగ్.! విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ల!

‘మా ప్రభుత్వ హయాంలో ఫుల్ పేజీ ప్రకటనలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం జరగదు..’ అని చాన్నాళ్ళ క్రితం వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ, జరుగుతున్న వ్యవహారం వేరే.!
వైసీపీ చెప్పే మాటలకీ, చేసే పనులకీ అస్సలు పొంతన వుండదని పదే పదే విజయసాయిరెడ్డి ప్రూవ్ చేస్తూనే వుంటారు.

‘కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు తమ ప్రభుత్వం గురించి ఘనంగా చెబుతోంటే, ఇంకో వైపు, ‘వాలంటీర్ పోస్టులన్నీ మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం..’ అంటూ వైఎస్ జగన్ గాలి తీసేశారు విజయసాయిరెడ్డి కొన్నాళ్ళ క్రితం.

ఇక, తాజాగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల ప్రవాహంతో సందడి చేశారు.

‘నీతి అయోగ్ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్ నెంబర్ 1‌కి ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్ల వున్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఒకరు..’ అంటూ ఓ ట్వీటేశారు విజయసాయిరెడ్డి.

‘కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్ దగ్గర లంచ్ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు ఐదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చ కుల మీడియా స్థాయి ఎక్కడ.?’ అని మరో ట్వీటులో ప్రశ్నించారాయన.

ఇలా సాగింది విజయసాయిరెడ్డి ట్వీట్ల ప్రవాహం. ప్రధానితో వైఎస్ జగన్ మీటింగుకి సంబంధించి వైసీపీ అను’కుల’ మీడియాలోనూ ప్రచారం జరిగింది. అయినా, ఈ రోజుల్లో పబ్లిసిటీ చేసుకోని పార్టీలు, ప్రభుత్వాలెక్కడున్నాయ్.

సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనం ఓ వైపు దుర్వినియోగమవుతోందన్న విమర్శలున్నాయి. వాటికి అదనంగా, ప్రకటనల రూపంలో ప్రజా ధనం దుర్వినియోగమవడమొకటి.

ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుంటే, ఆయనకూ అలాంటి గౌరవం దక్కతుుంది. టీడీపీ అను’కుల’ మీడియా పైత్యం గురించి విమర్శలు సరే, వైసీపీ అను’కుల’ మీడియా మాటేమిటి.? అందునా, విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న, చేస్తున్న ప్రచారం మాటేమిటి.?