ఏపీకి ప్రత్యేక హోదా పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా ఎన్డీయే కాలయాపన చేసిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. విజయశాంతి ఏమన్నారంటే…

“ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీయే నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేసింది. ఏపీలో తమ ఉనికి లేదనే నిర్ణయానికి బిజెపి వచ్చింది. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆటలాడుతున్నారు. తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతరులకు ప్రయోజనం చేకూర్చకుండా ఉండే ధోరణి బిజెపిది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుంది.

ఏపీలో కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు మిగిలిన పార్టీలు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో అర్ధం కావడం లేదు. అఖిల పక్షాలు కాంగ్రెస్ ను బలపరుస్తూ తీర్మానం చేస్తే బాగుంటుంది. బిజెపిని గద్దె దింపి భారత దేశాన్ని రక్షించుకుందాం” అని విజయశాంతి అన్నారు.