షాకింగ్: జగన్ పై హత్యాయత్నం కేసులో కుట్రపై మరో కుట్ర

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యాలశుడు వైఎస్ జగన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో భిన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలు కేవలం కుట్ర పూరితంగా జగన్ పై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణపై తమకు నమ్మకం లేదంటూ సిబిఐ విచారణ జరిపించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

ఈమేరకు సోమవారం ఉదయం పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ ని కలిసి రాష్ట్ర ప్రభుత్వం తమకు నమ్మకం లేదని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పటికే రాజనాధ్ సింగ్ కు తనపై హత్యకు కుట్ర జరిగిందని, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని ఒక లేఖను కూడా పంపారు.

కాగా మంగళవారం జగన్ పై దాడి చేసిన నిందితుడుని వైద్య పరీక్షల నిమిత్తం కెజిహెచ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు పోలీసులు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఆయన ట్వీట్స్ కూడా పెట్టారు. ఆ ట్వీట్స్ వివరాలేంటో చూద్దాం.

“శ్రీ వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ ను వైజాగ్ పోలీసులు రోజుల తరబడి విచారిస్తున్నా నోరు విప్పడం లేదని మీడియాకి లీకులు. నిందితుడేమో ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ మీడియాని వేడుకుంటున్నాడు. కుట్రపై మరో కుట్రకు తెర తీస్తున్నారు”. అంటూ ట్వీట్ చేసారు.