విశాఖపట్నం యాదవ సంక్షేమ సంఘం అద్వర్యం లో యాదవ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ. వెనుకబడిన కులాలను ఆర్ధికంగా,సామాజికంగా అబివృద్ది చేయాలని సీఎం జగన్ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అని ఆయన గుర్తు చేసారు. యాదవులు ఎక్కువుగా ఉన్న విశాఖ త్వరలో పరిపాలనా రాజధానిగా మారబోతుంది అన్నారు ఆయన.
తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని తొలి దర్శనం చేసుకొని అవకాశం యాదవులు గతంలో చంద్రబాబు ఇవ్వకపోతే సీఎంగా జగన్ వచ్చిన వెంటనే ఆ అవకాశం కల్పించారు అని ఆయన అన్నారు. విశాఖలో ఉన్న యాదవ కర్పూరేట్ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ కు బహుమతి గా ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. యాదవ సామాజికవర్గం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు ఎనలేని అభిమానం వుంది అని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ…గతం లో పార్టీ లు బిసి లను ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు అని ఆయన ఆరోపించారు.
మంచి మనసున్న వ్యక్తులు యాదవులు అని ఆయన కొనియాడారు. వెనుకబడిన కులాలు విద్య తోనే అబివృద్ది చెందుతాయి అని ఆయన అన్నారు. చంద్రబాబు యాదవులును ఓటు బ్యాంకు గా మాత్రమే చూసారు అని ఆయన ఆరోపించారు. అన్ని ప్రాంతాలు అబివృద్ది చెందాలి అని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆయన స్పష్టం చేసారు. పేద ప్రజలు పై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఎన్ టి రామారావు,రాజశేఖర్ రెడ్డి కలిస్తే సీఎం జగన్ అని ఆయన అన్నారు. జీవీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకొని సీఎం జగన్ కి బహుమతి ఇవ్వాలి అని ఆయన కోరారు.