ఆ ఇద్దరూ కలిసి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే రజనీకి చుక్కలు చూపిస్తున్నారా ?

Vidala Rajini to face more problems  
వైసీపీలో అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న  వ్యక్తుల్లో విడదల రజనీ ఒకరు.  2019 ఎన్నికల ముందువరకు రజనీ ఎవరో పెద్దగా జనానికి తెలియదు.  కానీ చిలకలూరిపేట నుండి టికెట్ దక్కించుకోవడంతో ఆమె హైలెట్ అయ్యారు.  అప్పటివరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో  కీలకంగా  ఉన్న మర్రి కుటుంబాన్ని పక్కనబెట్టి మరీ ఆమెకు టికెట్ ఇచ్చారు జగన్.  బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం అందునా మహిళ కావడంతో జగన్ ఆమెకు అవకాశం కల్పించారు.  రజనీ సైతం అందరి మద్దతునూ కూడగట్టుకుని టీడీపీ కీలక నేత ప్రత్తిపాటి పుల్లారావు లాంటి బలమైన నేత మీద గెలిచారు.  
 
Vidala Rajini to face more problems  
Vidala Rajini to face more problems
గెలిచాక తనను గెలిపించిన వర్గాలను ఉద్దేశ్యపూర్వకంగానే ఆమె పక్కన పెట్టారనే విమర్శలున్నాయి.  పార్టీలో పట్టు కోసం, సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని నియోజకవర్గంలో పాతుకుపోవాలనే ఆశతోటి రజనీ దూకుడుగానే వ్యవహరించారు.  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో అడుగడుగునా ఆమెకు  పొడచూశాయి.  మరోవైపు ఆమె కోసం టికెట్ త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ సైతం ఏ,ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తిగానే ఉన్నారట.  ఎన్నికల్లో సేవలను వాడుకుని ఎన్నికలు  అయ్యాక పక్కనపెట్టేశారనేది ఆయన వాదనట,  మర్రి సాదా సీదా నాయకుడేమీ కాదు.  ఒకప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచిన బలం అయనది.  ఆయనకంటూ సొంత వర్గం ఒకటుంది.  కుటుంబ నేపథ్యం కూడ ఆయనకు కలిసొస్తోంది. 
 
ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోవడంతో జగన్ ఆయనకు మంత్రి పదవి మీద హామీ ఇచ్చారని అంటుంటారు.  అయితే ఇప్పటివరకు ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.  ఇదే విషయాన్ని ఆయన జగన్ వద్దకు తీసుకెళ్ళారట.  జగన్ సైతం మర్రికి త్వరలో న్యాయం చేస్తామని అన్నట్టు భోగట్టా.  త్వరలో జరగనున్న  మంత్రివర్గ విస్తరణలోనే ఆయనకు అవకాశం దొరకవచ్చని అంటున్నారు.  పైగా ఎంపీ లావు, ఇంకొందరు పార్టీ పెద్ద నేతలు సైతం మర్రికి సపోర్ట్ చేస్తున్నారు.  ఈ పరిణామాలన్నీ కలిసి విడదల రజనీ భవిష్యత్తును ప్రశ్నర్థకంలో నెట్టేసేలా ఉన్నాయట.   ఇలా తనకు వ్యతిరేకంగా నడుస్తున్న తతంగం మొత్తాన్ని  రజనీ గమనిస్తూనే ఉన్నారట.  తనకు దక్కుతుందని అనుకుంటున్న మంత్రి పదవి వేరొకరికిపోతే ఎలా అనే మీమాంసలో ఉన్నారట.