కేటీఆర్ సింహం సింగిల్.. వీహెచ్ గరం గరం

 

తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింహం లాగే టిఆర్ఎస్ సింగిల్ గా వస్తది అని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై హన్మంతరావు మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వకపోతే మీరెక్కడ ఉండేవారని వీహెచ్ ప్రశ్నించారు. నేడు సింహం సింగిల్ గా వస్తదని అంటున్నారు మరీ నాడు సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నప్పుడు సింగల్ సింహం గుర్తుకు రాలేదా అని వీహెచ్ కేటీఆర్ ను నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా దగ్గర కుక్కల్లా ఉన్నవారు ఇప్పుడు సింహాలెలా అయ్యారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. బోనాల పండుగ సందర్భంగా జోగిని శ్యామల, స్వర్ణలత చెప్పినట్టే ఈ ప్రభుత్వం పతనమైతుందన్నారు. బీజెపీ నేతలు కావాలనే రాజాసింగ్ తో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అమిత్ షా ఆటలు సాగవని వీహెచ్ అన్నారు.