పవన్ నోట్లో లాలీపాప్… చంద్రబాబు రోజుకి ఎంతిస్తారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వారాహి యాత్ర రెండు దఫాలుగా సాగించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు దశలూ పూర్తయ్యాయి. ఫలితంగా… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర పరిసమాప్తం అయ్యిందని అంటున్నారు.

ఈ వారాహి వల్ల నిజంగా జనసేనకు ఎంత మైలేజీ వచ్చింది.. రాజకీయాల్లో పవన్ విలువ ఎంత పెరిగింది.. ఆయన మాటలపై ప్రజలకు ఎంత క్రెడిబిలిటీ ఏర్పడింది అనే సంగతి కాసేపు పక్కనపెడితే… వ్యక్తిత్వం పరంగా మాత్రం పవన్ దిగజారిపోయారని అంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవును… సీఎం జగన్‌ ను ఇకపై ఏకవచనంతోనే పిలుస్తానంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల కోసం ఇంతమంచి చేసే సీఎం జగన్‌ ను ఏకవచనంతో సంబోధిస్తావా..? అని ప్రశ్నిస్తూ… జగన్‌ ను ఏకవచనంతో పిలుస్తే తాట తీస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం మరింత డోసు పెంచిన ఆయన… వారాహి యాత్ర పేరుతో ఆ బండి మీద నిలబడి ఊరపందిలా ఊగుతూ మాట్లాడటం కాదని.. ఒకసారి ప్రజల్లోకి వస్తే వారికి జరిగే మేలు కనిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా… జగన్‌ ను ఏకవచనంతో పిలిచి రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తానంటూ మంత్రి ఫైరయ్యారు.

ఇదే సమయంలో… పగలు బీజేపీతో సంసారం.. రాత్రి టీడీపీతో కాపురం చేసే ఇలాంటి వ్యక్తి మనకు నీతులు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇలాంటి వెధవలను బ్యాన్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా… సినిమాల్లో చేస్తే రోజుకు రెండు కోట్లు వస్తాయని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్… అదే చంద్రబాబుతో యాక్ట్ చేస్తే రోజుకు రూ.10 కోట్ల ప్యాకేజీ తీసుకుంటాడని సెటైర్లు వేశారు. “ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడుతున్న నువ్వు.. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు నోట్లో లాలీ పాప్‌ లు పెట్టుకున్నావా” అని మంత్రి ఎద్దేవా చేశారు.