మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మ

మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మ

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మను ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియమించారు . నిజానికి పద్మను ఈ పదవిలో ఎప్పుడో నియమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే తెలుగు దేశం ప్రభుత్వహయాంలో ఈ పదవిలో వున్న నన్నపనేని రాజకుమారి ప్రభుత్వం మారిన తరువాత కూడా అదే పదవిలో కొనసాగాలని జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది . కానీ జగన్ మోహన్ రెడ్డి ఆమెకు ఎలాంటి హామీ ఇవ్వక పోగా అప్పుడే చైర్మన్ గా పద్మను నియమిస్తున్నట్టు ప్రకటించారు .

అయితే నన్నపనేని వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యలేదు. నిన్న గవర్నర్ ను కలసి తన రాజీనామా సమర్పించారు . ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పద్మ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వున్నారు .