Vasireddy Padma: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఏపీలో వైకాపా పరాజయం పాలు కావడంతో ఎంతో మంది కీలక నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది కీలక నేతలు వైకాపాకి గుడ్ బై చెబుతూ జనసేన, టిడిపిలో కొనసాగుతూ కీలక పదవులు అందుకున్న విషయం మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే వైకాపా హయాంలో మహిళా కమిషన్ గా ఉన్నటువంటి వైసీపీ మాజీ నాయకురాలుగా పేరుపొందిన వాసిరెడ్డి పద్మ కూడా ఈ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే.
ఇలా వైకాపాకు ఈమె రాజీనామా చేయడంతో ఈమె రాజకీయం ముగిసినట్టేనా అంటే దాదాపు ముగిసినట్టేనని తెలుస్తోంది. ఈమె వైకాపా నుంచి క్షణికావేశంలో బయటకు వచ్చారు కానీ తర్వాత ఏ పార్టీలోకి చేరాలి అనే విషయంపై సందిగ్ధంలో పడ్డారు. అయితే ఈమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుందని లేదు జనసేన పార్టీలోకి వెళుతుందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఏ పార్టీలోకి వెళ్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
జనసేన పార్టీలోకి ఈమెను ఆహ్వానించడానికి పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదట ఇప్పటికే తన పార్టీలో అంతా కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉండడంతో ఇంకాస్త మంది ఎక్కువ అయితే రాబోయే రోజుల్లో సమస్యలు వస్తాయని భావించిన పవన్ కళ్యాణ్ ఈమెను తన పార్టీలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు దగ్గర ఎంతో పలుకుబడి ఉన్నటువంటి ఓ మహిళ నేత అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. వాసిరెడ్డి పద్మ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అంటే ఆ మహిళా నాయకురాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప చంద్రబాబు లోకేష్ కూడా ఈమెను తమ పార్టీలోకి ఆహ్వానించేలా లేరని తెలుస్తోంది. ఈ విధంగా వైకాపాకు రాజీనామా చేసిన ఈమె తన రాజకీయ జీవితం మాత్రం ఎటు తేల్చుకోలేని విధంగా ఉందని చెప్పాలి.