ఏపీలో వాలంటీర్లపై పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా రేగుతూనే ఉంది. ఇందులో భాగంగా… తాజాగా కేంద్రం విడుదల చేసిన రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యానికి సంబంధించిన కేసుల వివరాలు వెలువడిన అనంతరం ఈ చర్చ మరింత హీటెక్కింది. దీంతో తాజాగా పవన్ పై ఫైరయ్యారు వాసిరెడ్డి పద్మ స్పందించారు.
తాజాగా రాష్ట్రాల వారిగా అదృశ్యమవుతున్న మహిళలు, బాలికల వివరాలు రాజ్యసభలో వెళ్లడించింది కేంద్రం. ఇందులో భాగంగా ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఘణాంకాలు వెలువడించింది. దీంతో పవన్ మరోసారి స్పందించారు. వీటికి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో ఫైరయిన వాసిరెడ్డి పద్మ… అదృశ్యమైన వివరాలను మాత్రమే కేంద్రం వెళ్లడించడంతో రాష్ట్రంపై విషం కక్కే జనం ఎగిరి పడుతున్నారు… ఈ గ్యాప్ లో తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడంలేదని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు.
మహిళల అదృశ్యంలో ఏపీ 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించలేదని, కేవలం మిస్ అయిన మహిళల సంఖ్యను చూపించి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్. వాలంటీర్ వ్యవస్థ వల్లే ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని అంటున్న పవన్.. ప్రేమ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని తెలుసుకోవాలని చెప్పారు.
ఇదే సమయంలో ఈ ప్రేమలకు, అదృశ్యాకేసులకూ సినిమాలు కూడా ఒక కారణం కాదా అని ప్రశ్నించిన పద్మ… చేతనైతే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ ఉచిత సలహాలిచ్చిన పవన్.. నోటీసులిస్తే మాత్రం వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు పవన్ కల్యాణ్ కి కనిపించవా అని ప్రశ్నించారు.
ఏపీలోని మహిళల మిస్సింగ్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు తాపత్రయపడుతున్నారని ప్రశ్నించిన వాసిరెడ్డి పద్మ.. ఏపీ మీద ఎందుకు విషం చిమ్ముతున్నారని అడిగారు. ఈ సందర్భంగా “మీది రాజకీయపరమైన కోపమా? రాష్ట్రం మీద కోపమా” అని నిలదీశారు. ఇదే సమయంలో 11వ రాష్ట్రంగా ఉన్న ఏపీ మీద మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు.. మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మరింత ఫైరయిన ఆమె… పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు, పిచ్చి పుత్రుడు కూడా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఈ సందర్భంగా పవన్ కు ఒక ఛాలెంజ్ చేశారు. మహిళలు సమక్షంలో రచ్చబండ పెడదాం.. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే రచ్చబండకి రావాలని అని వాసిరెడ్డి పద్మ ఛాలెంజ్ విసిరారు!