టీడీపీని జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంటారు. ఎంత జాతీయ పార్టీ అయితే మాత్రం… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒకమాట – జాతీయ అధ్యక్షుడు మరో మాట మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్.. యువనాయకుడు ఒక స్టాండ్ – సీనియర్ నేతలు మరో స్టాండ్ తీసుకోవడం ఇంకెంతవరకూ కరెక్ట్? అది కూడా ఒకే రాష్ట్రంలో.. ఒకే విషయానికి సంబంధించి. ఇది ఇంకెంత దారుణం.? అలాంటి దారుణాలు చేయడంలో ఏమాత్రం తగ్గేదిలే అనే చినబాబు లోకేష్… తాజాగా ఒక కొత్త హామీ ఇచ్చేశారు. ఆ హామీని టీడీపీ నేతలు లైట్ తీసుకున్నారో లేక, ఆ హామీ ఇచ్చిన లోకేష్ ని లైట్ తీసుకున్నారో తెలియదు కానీ… లోకెష్ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ధర్నా చేయడం మొదలుపెట్టారు.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఆనకా నవ్వొచ్చినా.. తర్వాత అసహ్యం అనిపించినా.. ఇది వాస్తవం. వివరాల్లోకివెళ్తే… ఏపీలో ఉన్న బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన జరిగిన బడ్జెట్ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది. దీపై బోయ, వాల్మీకులు హర్షం వ్యక్తం చేస్తుంటే… ఏడు శాతం ఉన్న తమ రిజర్వేషనల్లో ఆ కులస్తులు చేరితే తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని గిరిజనులు వాపోతున్నారు.
ఇందులో భాగంగా.. ఏపీలోని మన్యం జిల్లాల బంద్ ని నిర్వహించాయి గిరిజన సంఘాలు. ఈ బంద్ కి టీడీపీ కూడా మద్దతిచ్చింది. వైసీపీ ప్రభుత్వం గద్దే దిగాలని.. మన్యం ప్రాంతంలోని వైకాపా ఎమ్మెల్యే, ఎంపీలు రాజీనామా చేయలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆ సంగతి కాసేపు అలా ఉంచి… ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ విషయానికొద్దాం. తాజాగా యువగళం పాదయాత్రలో మైకందుకున్న లోకేష్… వాల్మీకి – బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో కలిపేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మరి… అసెంబ్లీలో జగన్ చేసింది కూడా అదేగా? మరి దాన్ని వ్యతిరేకిస్తూ… ధర్నా చేస్తుంది టీడీపీ నేతలేగా? ఇలా ఉంది చినబాబు & టీడీపీ రాజకీయం.
దీంతో… మన పార్టీ వాల్మీకీ – బోయలను ఎస్టీ జాబితాలో కలపడాన్ని స్వాగతిస్తున్నట్లా – వ్యతిరేకిస్తున్నట్లా? అని జుట్టుపీక్కుంటున్నారు తమ్ముళ్లు. ఇలా తండ్రి ఒకమాట – కొడుకు ఒకమాట – అచ్చెన్నాయుడు మరోమాట – ఐటీడీపీ ఇంకోమాటా వద్దని… ఏదో ఒక స్టాండ్ తీసుకుని నిలబడకపోతే జనం కార్టూన్స్ ని చూసినట్లు చూస్తారని నేతలు ఫీలవుతున్నారంట. దీంతో… విషయం తెలుసుకున్న వైకాపా సోషల్ మీడియా జనాలు మాత్రం… “వాడ్ని ఎవరికైనా చూపించండ్రా… అలా వదిలేయకండ్రా బాబు..” అంటూ ట్రోల్ చేస్తున్నారు!!