అన్‌స్టాపబుల్ ట్రోలింగ్: బాలయ్య, పవన్ మీద ఎందుకు.?

సోషల్ మీడియా వేదికగా ‘అన్‌స్టాపబుల్’ ట్రోలింగ్ జరుగుతోంది నందమూరి బాలకృష్ణ మీదా, పవన్ కళ్యాణ్ మీదా.! జస్ట్ అదొక టాక్ షో మాత్రమే.! ‘ఆహా’ అనే ఓటీటీ దీన్ని స్ట్రీమింగ్ చేస్తోంది.

మామూలుగా అయితే, ఇలాంటి టాక్ షో విషయమై పెద్దగా చర్చ అనవసరం. కాకపోతే, ఇద్దరూ ప్రముఖ నటులు.. అదే సమయంలో రెండు వేర్వేరు పార్టీల నుంచి ముఖ్య నాయకులుగా వున్నారు. ఒకరేమో టీడీపీ ఎమ్మెల్యే, ఇంకొకరేమో జనసేన పార్టీ అధినేత. సో.. బాలయ్య – పవన్ మధ్య ‘అన్‌స్టాపబుల్’ కంటెంట్ నడవొచ్చునని సినీ, రాజకయ అభిమానులు ఆశించొచ్చు.

అసలు ఈ టాక్ షో‌కి వెళ్ళడమంటేనే చాలా పెద్ద తప్పు చేసినట్లని పవన్ కళ్యాణ్ మీద కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ని విమర్శించారన్నది ప్రధాన కారణం. అలాగైతే, నేరస్తుడిగా వైఎస్ జగన్ మీద విమర్శలు చేసిన బొత్స సత్యనారాయణ, వైసీపీలో కీలక నేత ఇప్పుడు.

అది రాజకీయం.. అక్కడ అలాగే వుంటుంది.! మరి, పవన్ – బాలయ్య కూడా రాజకీయ నాయకులే కదా.! వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం వైసీపీకి మాత్రం ఎందుకు.? ఈ ట్రోలింగ్ వల్ల అన్‌స్టాపబుల్ షో బోల్డంత క్రేజ్, పాపులారిటీ సంపాదించుకుంటోంది. అదే సమయంలో టీడీపీకి, జనసేనకీ మైలేజ్ కూడా వచ్చిపడుతోంది.

చిత్రమేంటంటే, ఈ మైలేజీని చెడగొట్టుకోవడానికి, టీడీపీ అలాగే జనసేన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. బాలయ్యను సమర్థిస్తూ టీడీపీ, పవన్ కళ్యాణ్‌ని సమర్థిస్తూ జనసేన.. సోషల్ మీడియాలో స్పందించడమే కాదు.. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు ట్రోలింగ్ కూడా చేసుకుంటుండడం గమనార్హం.