రాజకీయం పేకాటగా మారిపోయింది… (వీడియో)

నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాజీ ఎంపి  ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రమయిన వ్యాఖ్య చేశారు.

 ఈ రోజు రాజకీయం పేకాటలాగా మారిందని అన్నారు.

అదివారం నాడు విజయవాడలో  ‘నవ్యాంధ్రలో నా నడక’అంటూ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు రాసిన  పుస్తకాన్ని సుప్రీంకోర్టు కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చమలేశ్వర్ తోె ఆవిష్కరిస్తూ  ఉండవల్లి  ఈ వ్యాఖ్య చేశారు.

‘ఈ రోజు రాజకీయం ఓటు కొనుక్కునే  వ్యాపారం లాగా,  పేకాట లా మారిపోయింది,’ అన్నారు. చాలామంది ఐ ఎ ఎస్, ఐపిఎస్  అధికారులు కనీసం రిటైర్మెంట్ అయ్యిన తర్వాత నయినా  తమ  కళ్లముందు ఆ రోజుల్లో జరిగిన విషయాలను  ప్రజలకు జరిగిన నష్టాన్ని,  ఎదో ఒక రూపంలో  తెలియ చేయాల్సిన అవసరం ఉంది,’అని అన్నారు. ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను వెలికి తీసేందుకు  ఐవైఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఉండవల్లి ప్రశంసించారు. 

‘రాజకీయ నాయకులు నిజాలు చెప్పినా  ప్రజలెవ్వరూ నమ్మరు.  మీలాంటి అధికారులు బయటకు వచ్చి ప్రభుత్వంలో జరుగుతున్నదేమిటో  చెప్తే ప్రజలు నమ్ముతారు. భారత దేశం వ్యవస్థ మొత్తం పన్నుల మయంగా మారింది,’ అని ఆయన అన్నారు.

ఐవైఆర్ పుస్తకం గురించి చెబుతూ  అమరావతి ప్రభుత్వుం  తీసుకున్న  లోప భూఇష్టమైన నిర్ణయాలు, ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఉండాల్సిన సంబంధాలు, ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి కాక పోవడంలోని లొసుగులు,  బ్రాహ్మణకార్పొరేషన్ గా పని చేస్తున్నప్పుడు తనపై వచ్చిన ఆరోపణలను పుస్తకం లో పొందు పరచానని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ ‘నేను పాలిటిక్స్ లో లేను, రాను.. సమస్యలపైనే ప్రశ్నిస్తున్నాను మాట్లాడుతున్నాను. ఈ రెండు రాష్ట్రాల విభజన ద్వారా ఏర్పడ్డ సమస్యలు ఏర్పడటానికి ముఖ్య కారణం సమగ్ర ఆలోచన లేకపోవటమే. న్యాయ వ్యవస్థ  కూడా ఇలానే ఉందని నేను ఆనాడే చెప్పాను.  ప్రశ్నించే హక్కుకోసం మాట్లాడుతున్నా,’  అని అన్నారు.