జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే వరద బాధిత ప్రాంతాలపై పవన్ కన్నెత్తి కూడా చూడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వరద బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం జనసేన ఫ్యాన్స్ ను సైతం హర్ట్ చేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు తన వంతు సహాయం చేశారు. చంద్రబాబు జోరుగా పర్యటనలు చేస్తూ ప్రజల మెప్పు పొందడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నుంచి వరద బాధితులకు ఆశించిన స్థాయిలో సహాయసహకారాలు అందలేదు.
వైసీపీ సాయం చేయకపోయినా బాగుండేదని చాలా తక్కువ మొత్తంలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇచ్చి వైసీపీ పరువు తీసుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు చేసే విమర్శలకు ధీటుగా బదులివ్వడంలో పవన్ విఫలమవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ తాజాగా పవన్ దత్తపుత్రుడని కాపుల ఓట్లతో చంద్రబాబుకు బెనిఫిట్ కలిగేలా పవన్ వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేశారు.
జగన్ కామెంట్లపై పవన్ వెంటనే స్పందించి ఘాటుగా జవాబివ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా సినిమాలను పూర్తి చేసి రాజకీయాలతో బిజీ కావాలని పవన్ ప్రయత్నిస్తే ఆయన రాజకీయాల్లో సక్సెస్ సాధించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఆయన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.