ఆ పథకం జనసేనను గెలిపిస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా జనసేన పార్టీ గెలుపు కోసం యువతపై దృష్టి పెట్టారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిని మాత్రమే రాజధానిగా ఉండేలా చూడాలని పవన్ భావిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉండేవాళ్లకు ఉచితంగా ఇసుక లభ్యమయ్యేలా చేయాలని పవన్ భావిస్తున్నారు.

సౌభాగ్య పథకం ద్వారా వ్యాపార పెట్టుబడి కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. యువతకు వ్యాపార పెట్టుబడి కోసం 10 లక్షల రూపాయలు ఒక్కసారే ఇవ్వాలని ఈ విధంగా ఐదు సంవత్సరాలలో 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలని జనసేన భావిస్తోంది. ఈ పథకం గురించి జోరుగా ప్రచారం చేస్తే యువత జనసేన పార్టీపై ఆకర్షితులయ్యే అవకాశం అయితే ఉంది.

రాష్ట్రంలో యువతకు భారీస్థాయిలో ఉద్యోగాలు కల్పించడం సులువు కాదు. దేశంలో వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా పెట్టుబడి లేక ఆ ఆలోచనను విరమించుకుంటున్న వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లను జనసేన ప్రకటించిన సౌభాగ్య పథకం ఆకట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. జనసేనను గెలిపించే పథకం ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ పథకం అమలు చేయడం సాధారణమైన విషయం కాదు. పవన్ చెబుతున్న లెక్కల ప్రకారం ఈ పథకం ఐదేళ్ల పాటు అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఈ హామీ ఆచరణ సాధ్యం కాని హామీ అని రాజకీయ విశ్లేషకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు వచ్చినా రాజకీయాలకు దూరం కాకూడదని భావిస్తున్నారని సమాచారం.