ఏపీ సీఎం వైఎస్ జగన్ కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో యాత్రలు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ కఠిన నిబంధనలు పవన్, చంద్రబాబులకు మేలు చేస్తే వైసీపీకి తీవ్రస్థాయిలో నష్టం కలగజేస్తున్నాయి. పవన్, చంద్రబాబులను జగన్ ఇబ్బంది పెడుతున్నారనే భావన ప్రజలకు కలిగితే ఆ నష్టం వైసీపీపై తీవ్రస్థాయిలో పడుతుంది.
జగన్ సర్కార్ ఎంత కష్టపడినా చంద్రబాబు, పవన్ లను ఇబ్బంది పెట్టడం ద్వారా ప్రజల్లో వాళ్లపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేదు. చంద్రబాబు, పవన్ పాదయాత్రలు చేసినా వాటి వల్ల ఫలితం కూడా పెద్దగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతీకార చర్యలకు ఇది సరైన సమయం పెట్టలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు జగన్ ప్రతి నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ వకాశాన్ని చంద్రబాబు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే జగన్ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వాలు కూడా ఇవే తరహా తప్పులు చేసి ఉంటే తీవ్రస్థాయిలో నష్టం కలిగి ఉండేదనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపు కోసం రెండు పార్టీలు సర్వేలపై ఆధారపడ్డాయి. సర్వేల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికలో మార్పు ఉండనుందని సమాచారం అందుతోంది. బాబు బలపడే విధంగా వైసీపీ అడుగులు వేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024లో కూడా జగనే సీఎం కావాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.