రామోజీకి ఉండవల్లి భయం ఈ స్థాయిలో ఉంది!

మీడియా మొగల్ చెరుకూరి రామోజీ రావుకు ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే రోజు రోజుకీ భయం పెరిగిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయంటూ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండవల్లి పోరాడుతున్నారు. ఈ పోరాటాన్ని రామోజీపై కక్ష సాధింపు చర్యగా చూడొద్దని.. చట్టాలు అందరికీ సమానం అన్న విషయం రామోజీకి గుర్తుచేయడానికే ఈ పోరాటం అని ఉండవల్లి స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో రామోజీకి ఉండవల్లి భయం ఏస్థాయిలో ఉందో తెలిపే సంఘటన తెరపైకి వచ్చింది.

మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని.. చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా రామోజీ నడుచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని అక్రమంగా వసూల్ చేస్తున్నారని.. ఫలితంగా లక్షల కుటుంబాలతో ఆడుకుంటున్నారని ఉండవల్లి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా జాతీయస్థాయిలో విచారణ సంస్థలు సైతం విస్తుపోయే స్థాయిలో ఉండవల్లి.. మార్గదర్శికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అయితే… ఇందులో మార్గదర్శి తప్పేమీ లేదని, జగన్ సహకారంతో ఉండవల్లి… రామోజీపై కక్ష పూర్తిత కార్యక్రమం చేస్తున్నారన్ని టీడీపీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు.

ఈ విషయాలపై ఉండవల్లి సీరియస్ అయిపోయారు. తాను చేస్తున్న పోరాటం వ్యక్తిగత కక్షసాధింపు చర్య కాదు.. వ్యవస్థాగత పోరాటం అని అనేక వేదికలపై బలంగా చెప్పారు. తన పోరాటం తప్పని నిరూపించే పనికి ఎవరైనా పూనుకుంటే వారితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ పై రామోజీరావు కిమ్మనకుండా సైలంట్ గా ఉండిపోతే…. తగుదునమ్మా అనుకుంటూ టీడీపీ అధికారప్రతినిధి హోదాలో జీవీ రెడ్డి తెరపైకి వచ్చారు. చూసుకుందామంటే… చూసుకుందామంటూ డైలాగులు వేశారు.

కట్ చేస్తే… అనుకున్న ముహూర్తం దగ్గరపడింది. దానికి ఒక రోజు ముందే… జీవీ రెడ్డి చేతులు ఎత్తేశారు. శంఖం పూరించినట్లు కనిపించి.. పలాయనం చిత్తగించారు. నిన్న మొన్నటి వరకూ సై సై అని… టైం దగ్గరపడగానే సైలంట్ అయిపోయారు. తాను డిబేట్ కి రాలేనంటూ ఉండవల్లికి మేసేజ్ చేశారు. దీనికి ఆయన చెప్పిన కారణం బిజీ షెడ్యూల్‌ అంట. ఈ కారణమే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం… మార్గదర్శి గురించి మాట్లాడటం కంటే జీవీ రెడ్డికి ముఖ్యమైన పని ఉంటుందా? దీంతో… ఇదంతా రామోజీ పని అని, ఉండవల్లితో పెట్టుకుంటే తన డొంకలు ఇంకా బహిరంగంగా కదులుతాయని ఆయన జంకారని.. ఫలితంగా జివీ రెడ్డిని ఆపేశారని అంటున్నారు!

ఈ డిబేట్‌ లో తాను సక్సెస్ కాకపోతే… ఇంతకాలం చేస్తున్న పోరాటం వృథా అని ఉండవల్లి భావించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా మరింత కీలక సమాచారాన్ని ఆయన సేకరించారంట. గతంలో రామోజీరావు చిట్‌ ఫండ్ వ్యవహారంలో నాలుగు రోజులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌ లో విచారణ ఎదుర్కొన్న అంశాన్ని ఇటీవల ఉండవల్లి బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో… తనకు సంబంధించి బయట ప్రపంచానికి తెలియని రహస్యాలు… ఇంకా ఎన్ని బయటపెడతారో అని రామోజీ భయపడ్డారని అంటున్నారు. దీంతో… నేరుగా రామోజీరావే జీవీరెడ్డితో మాట్లాడారని… ఉండవల్లితో చర్చ వద్దన్నారని.. ఆ వ్యవహారం తాము చూసుకుంటామని చెప్పారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది!

నిజంగా మీడియా మొగల్ చెరుకూరి రామోజీరావుని.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రేంజ్ లో భయపెట్టడం మాత్రం చరిత్రపుటల్లో నిలిచిపోతుందనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా కనిపిస్తున్నాయి.