లక్ష్మీపార్వతిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు… తెరపైకి ఎన్టీఆర్ మాటలు!

ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి ఒకరు ఉపయోగించుకుంటుంటే… పొలిటికల్ ఫ్యూచర్ కోసం మరొకరు ఉపయోగించుకున్నారని కథనాలొచ్చాయి.

ఇందులో భాగంగా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక రాజకీయం జరిగిందంటూ కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో హస్తిన వేధికగా ఏపీలో పొత్తుల చర్చలు మొదలయ్యాయి. మరోవైపు తనకు అవమానం జరిగిందంటూ లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ విషయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీనియర్‌ పొలిటీషియన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి.. లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు! ఇదే సమయంలో ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతి పెళ్లిపై కూడా ఆయన స్పందించారు.

లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని.. అందరి సమక్షంలో బహిరంగ వేదిక మీద పెళ్లి చేసుకున్నారని గుర్తు చేశిన ఉండవల్లి… అలాంటి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపొవడం తప్పని అన్నారు. ఇదే సమయంలో… ఆమె వల్లే తాను బతికానని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారని.. అది అందరికీ వినిపించిందని తెలిపిన ఆయన… ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం తనకు బాధకలిగించిందని తెలిపారు.

కాగా… విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన.. మండలి బుద్ధప్రసాద్‌ తో కలిసి పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారు.

కాగా… ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయిల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, తనకు ఆహ్వానం అందించకపోవడం బాధగా అనిపిస్తోందని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థికమంత్రి కి ఆమె లేఖ రాశారు!