శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ ?

ముక్కోటి ఏకాదశికి కొద్ది రోజుల ముందే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఉన్న కొన్ని ఆంక్షలను సడలించింది. 65 ఏళ్లు పైబ‌డిన వారు, ప‌దేళ్ల లోపు వారు కరోనా సూచనలు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలతో సొంత నిర్ణయం మేర‌కు స్వామివారి ద‌ర్శనానికి రావొచ్చని సూచించింది.

TTD
TTD

కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్ 2020 జూన్ 8 నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ వస్తోంది టీటీడీ. అయితే దర్శనాల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 65 సంవ‌త్సరాలు పైబ‌డిన‌వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గ‌ర్భిణులు, ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుగ‌ల వారి విషయంలో ఆంక్షలు విధించింది. అయితే ఈ విషయంలో టీటీడీకి అనేక అభ్యర్థనలు వచ్చాయి.

దర్శనానికి సంబంధించిన అభ్యర్థనల్లో చాలామంది పిల్లల కేశఖండన, చెవిపోగులు కుట్టడం, అన్నప్రాసన, ష‌ష్టిపూర్తి చేసుకునే వారు, 70-80 సంవ‌త్సరాల శాంతి చేసుకున్నవారు ఉంటున్నారు. ఇది భ‌క్తుల ఆచారాలు, సంప్రదాయాలు, మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న అంశం కావడంతో.. పిల్లలు, వృద్ధులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే ముంద‌స్తుగా దర్శన టికెట్ల బుక్ చేసుకోవాలని.. దర్శన టికెట్లు కలిగిన వారికి మాత్రమే తిరుమలకు అనుమతి ఇస్తామని వెల్లడించింది