ముఖ్యమంత్రిని తిట్టకూడదు.. ప్రధానిని తిట్టొచ్చా కేటీయార్ సారూ.!

రాజకీయాల్లో బూతుల ప్రవాహం పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట పడే ప్రసక్తే లేదు. ఎందుకంటే, రాజకీయాల్లో అవినీతి, పార్టీ పిరాయింపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే, రొచ్చు చాలా చాలానే వుంది. ‘దుర్మార్గం’ అనేది పెరగడమే తప్ప, తగ్గడం అనేదే వుండదు రాజకీయాల్లో.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరిగిపోయిన బూతుల ప్రవాహంపై తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీయార్) గుస్సా అయ్యారు. ‘ఏపీలో ఆ బూతులేంటి.?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసేశారు. ముఖ్యమంత్రుల్ని తిట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా.. సామాన్యడు అయినా, ఎవరైనా ఒకటే. ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని తిట్టడం నేరం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా, టీఆర్ఎస్ అధినేత కేసీయార్, అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ‘చప్రాసి’ అనేశారు. అప్పట్లో అదో పెను దుమారం.

సోనియాగాంధీని దెయ్యమన్నారు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల్ని నానా రకాలుగా తిట్టారు. ఏమన్నా అంటే, ‘మా తెలంగాణలో ఇంతే.. మా భాష గిట్లనే వుంటది..’ అని సెలవిచ్చేవారు కేసీయార్. కేటీయార్ తక్కువ తిన్నారా.? తెలంగాణ ఉద్యమంలో ఎందరో పోలీస్ అధికారులపై నోరు పారేసుకున్నారు.

‘ఆంధ్రా లం.. కొడుకులు..’ అన్న మాట తెలంగాణ నేతల నుంచి చాలా సులువుగా వచ్చేసింది. అలాంటి తెలంగాణ నాయకులు, ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడుతూ, నీతులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఔను, ఆంధ్రప్రదేశ్ సిగ్గు పడాల్సిందే.. ఎందుకంటే, రాష్ట్రంలో బూతు రాజకీయాల గురించి దేశమంతా చర్చించుకుంటోంది మరి.

అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనూ బూతుల ప్రవాహం మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి, కేటీయార్, మంత్రి మల్లారెడ్డి.. ఇలా లిస్టు పెద్దదే. రాజకీయాల్లో అంతే.. బూతులు లేనిదే రాజకీయాల్లేవ్ ఇప్పుడు. ఇదో రాజకీయ దౌర్భాగ్యమంతే.