మక్తల్ టిఆర్ఎస్ అభ్యర్థిపై తిరుగుబాటు (వీడియో)

మక్తల్ టిఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టిఆర్ఎస్ లోనే తిరుగుబాటు మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నేతలంతా ఏకమై నర్వ మండల కేంద్రంలో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. మఖ్తల్ సిట్టింగ్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి సతీమణి పైనా విమర్శలు గుప్పించారు టిఆర్ఎస్ నేతలు. గతంలో బంగారు తెలంగాణ సాధించే ఉద్దేశంతో చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ గూటికి చేరారు. ఆయన గద్వాల మాజీ ఎమ్మెల్యే డికె అరుణకు సొంత తమ్ముడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. 

 

మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండల హెడ్ క్వార్టర్ లో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ సభ నిర్వహించారు స్థానిక టిఆర్ఎస్ నేతలు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ రా మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కమిషన్ల ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారని విమర్శించారు. అలాగే ఆయన భార్య అయినటువంటి చిట్టెం సుచరితమ్మ ద్వారా కూడా కమిషన్లు వసూలు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. టిఆర్ఎస్ టికెట్ ను ఆయనకు కేటాయించడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ చిట్టెం రామ్మోహన్ రెడ్డికి కేటాయించిన సీటును నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి పనిచేస్తామని వారు తెలిపారు. ఇంకా కేసిఆర్ బి ఫారం ఇవ్వలేదు కనుక టికెట్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి టికెట్ రాకుండా ఉద్యమం చేయడానికి మేము అంతా సిద్ధమని తెలిపారు 1000 మందితో పాదయాత్ర చేసి ప్రగతి భవన్ కు వెళ్లి టికెట్ ఇవ్వవద్దని కేసీఆర్ కు మెమోరాండం ఇస్తామని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ జెండా ఎగురవేయాలంటే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని మార్చాలన్నారు.

చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి టికెట్ వద్దని పల్లె పల్లెలో సంతకాల సేకరణ చేస్తామని అలాగే కేసిఆర్ కు ఫ్యాక్స్ ద్వారా సంతకాల సేకరణ ప్రతులను పంపిస్తామని వారు తెలిపారు. ఇంటలిజెన్స్ రిపోర్టులో చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి 100 శాతానికి 30 శాతం మార్కులు వచ్చినట్టు వారు గుర్తు చేశారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పార్టీ ని అభివృద్ధి చేయడానికి పార్టీలోకి రాలేదని తన స్వార్ధ రాజకీయాలకోసం పార్టీ మారినట్టు వారు ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే మక్తల్ నియోజకవర్గం లో చిట్టెం రామ్మోహన్ చేయలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. టిఆర్ఎస్ నేతలు మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.