ఆంధ్రాకు ‘హోదా’కు వద్దు, టిఆర్ఎస్ ఆంధ్ర వ్యతిరేక వ్యూహమా?

(లక్ష్మణ్ విజయ్)

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్ని డిమాండ్ ను  తెలంగాణా రాష్ట్ర సమితి వ్యతిరేకించింది. తెలుగుదేశం పార్టీ తీసుకు వచ్చిన అవిశ్వాస తీర్మానం తర్వాత ఈ  డిమాండ్ ఏమిటా అనేదాని మీద దేశం దృష్టి పడింది. తెలుగుదేశం పార్టీ నినాదం చర్చ నీయాంశమయింది. తీర్నానాన్ని సభలో నెగ్గించుకున్న మోదీ ప్రభుత్వం, ఈ డిమాండ్ వీలుకాదని చెప్పి ఆంధ్రులను మోసగించింది. మోదీ ప్రభుత్వం ఎంతమోసం చేసిందో  ఆంధ్రప్రజలకే కాదు, దేశమంతా తెలిసిపోయింది. ఇది జరిగిన 48 గంటలు కాకముందే టిఆర్ ఎస్ ఎంపి బి వినోద్ కుమార్,పార్టీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇతర సీనియర్  నేతలు తుల ఉమ, గెల్లు శ్రీనివాసయాదవ్‌, జల్లి సిద్ధయ్య, వెంకటేశ్వర్‌రెడ్డిలతో కలసి తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం ప్రకటించారు.

ఇది బిజపితో కలసి టిఆర్ ఎస్ అడుతున్న నాటకమని వేరే చెప్పాల్సిన పనిలేదు.  ఈ నినాదం టిఆర్ ఎస్ పార్టీకి కూడా అవసరం.  ఎన్నికలు కళ్ల ముందు కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే బలంగా ఆంధ్రా సెంటిమెంట్ తీసుకువచ్చేందుకు టిఆర్ ఎస్ ఆడుతున్న నాటకమన ఇది అని అనుకోవలసి వస్తుంది.  తెలుగుదేశం పార్టీ కోరుతున్న ’ప్రత్యేక హోాదా’ డిమాండ్ ను ఇతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని,పక్కనే ఉన్న తెలంగాణ, తమిళనాడులు వ్యతిరేకిస్తున్నాయని చెప్పేందుకు బిజెపి  చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదని పిస్తుంది. ప్రత్యేక హోదాను వ్యతిరేకించడం టిఆర్ ఎస్ విధానం కాదు.  ఒక టి రెండు రోజుల్లో తమిళనాడులో ఉన్న అన్నాడిఎంకె  ఇలాంటి ప్రకటన చేయించినా ఆశ్చర్యం లేదు.  గతంలో ఆంధ్ర  ప్రాంతంమీద వ్యతిరేకత నూరిపోసి టిఆర్ ఎస్ ఎన్నికల్లో గెలిచింది. ఇపుడు తెలంగాణ లో మరొక సారి ఆంధ్ర హోదా వ్యతిరేక సెంటిమెంట్ ను రెచ్చగొట్గి 2019ఎన్నికల్లో గెలవాలని టిఆర్ ఎస్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే నిన్న వినోద్ అండ్ కో చేసిన ప్రకటన. ఆయన పేరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ   ప్రత్యేక హాదా మీద తీసుకున్న సంకల్పాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎలా ప్రత్యేక హోదా ఇస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఆంధప్రజలకు కేంద్రం ఇచ్చిన హమీ ని వ్యతిరేకించడం తగునా? వినోద్ వాదన ప్రకారం, ఏ రాష్ట్రానికి ఏమీ ఇవ్వరాదు.  పక్కరాష్ట్రాలకు నష్టం. ఈ వాదన సరైంది కాదు.

ఎంపి వినోద్ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. గతంలో ఎపుడూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ ను వ్యతిరేకించలేదు. ఇవిగో సాక్ష్యాలు :

2016,2017,2018 లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు , లోక్ సభ సభ్యురాలు కవిత సభలోనూ, సభ బయట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా డిమాండ్ ను బలపరిచారు. ఇదిగో ఆమె మద్దతును టైమ్స్ ఆప్ ఇండియా ఇలా ప్రచురిచింది.

 

ఈ ఏడాడి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రసంగిస్తూ ఆమె చాలా స్పష్టమయిన మాటలో ప్రత్యేక హోదా కు మద్దతు తెలిపారు. నిజానికి కవిత ఇలా ప్రత్యేక హోదాకు మద్దతు తెలపడం ఇది మొదటి సారి కాదు. 2016లోనే ఆమె ఈ డిమాండ్ కు మద్దతు తెలిపారు.

ఆ తర్వాత  2017 లో కూడా మద్దతు తెలిపారు.

ఉన్నట్లుండి ఇపుడు వినోద్ అండ్ కో కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నష్టమని గుర్తొచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి  పరిశ్రమలు తరలిపోతాయని, ఆందువల్ల ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు పన్నుల రాయితీ ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఆంధ్రుల ప్రత్యేక హోదా కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిసి, తాము అధికారంలోకి వస్తూనే  ఆంధ్రకు ప్రత్యేక హోదాఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగాననే బిజెపి, టిఆర్ ఎస్ కలసి సంయుక్త వ్యూహం పన్నినట్లు అర్థమవుతుంది. దీనివల్ల  రెండు ప్రయోజనాలున్నాయి. ఆంధ్ర డిమాండ్ నువ్యతిరేకించి ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ ను తెలంగాణా రాజేయడం,రెండు కాంగ్రె స్ పార్టీని ఆంధ్ర తొత్తు పార్టీ అని ముద్రేసి అపఖ్యాతి పాలుచేయడం.

నిన్న ఢిల్లీలో తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చేసిన వాదన ఏమిటంటే ఇప్పుడిప్పుడే తెలంగాణకు పరిశ్రమలు వస్తున్నాయి, కాంగ్రెస్‌ ఇలా మద్దతు  ప్రకటిస్తే  రాష్ట్రానికి ఊహించని నష్టం కలుగుతుంది.

తెలుగుదేశం పార్టీ దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు చేస్తున్న తరుణంలో  టిఆర్ ఎస్ ఇలా మాట మార్చడం బిజెపి ప్రోద్బలంతోనే నని అనుమానించాల్సి వస్తుంది.