AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పై వైకాపా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆరు నెలలు అవుతుంది అయితే ఈ ఆరు నెలల కాలంలో అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇలా ముందుగా నిరసనలు చేపట్టడం తెలుగుదేశం పార్టీకే లాభం చేకూరుతుందా అంటే అవునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల పెరిగిన విద్యుత్ చార్జీల పై నిరసనలు తెలియజేశారు అయితే విద్యుత్ చార్జీలు పెరిగినప్పటికీ ఆ భారం ఇంకా ప్రజల వద్దకు రాలేదు ఏదైనా భారం ప్రజలు మోసినప్పుడే ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందే తప్ప ఇలా ఆదిలోనే నిరసనలు చేపడుతూ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అధికార ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుంది. ఇలా చేయటం వల్ల ప్రతిపక్ష పార్టీకి ఒరిగిందేమీ ఉండదు.
ఇంకా కూటమి ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరకాలం సమయం ఉంది ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు చివరి రెండు సంవత్సరాలలో అమలు చేసిన ప్రజలందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతారు. కనీసం కూటమి ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇచ్చి అయినా జగన్ మోహన్ రెడ్డి ప్రజలలోకి వస్తే బాగుంటుందని కొందరు చెప్పినప్పటికీ ఆయన మాత్రం ప్రజలలోకి వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విమర్శలు జనాల చెవికి ఎక్కకపోగా ఆరు నెలలలోనే అధికార దాహమా అన్న కొత్త విమర్శలు కూడా వైసీపీ మీదకు వస్తాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజలలో ఏర్పడాలి అంటే మరికొంత సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని అప్పుడే వైసిపి నిరసనలు చేసిన వారికి లాభం ఉంటుందే తప్ప ఇప్పుడు నిరసనలు చేస్తే ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకొని ప్రజలలో మరింత ఆదరణ సంపాదించుకుంటుంది.ఈ తొందర వైసీపీకి రాజకీయ లాభమా లేక టీడీపీ కూటమికా అంటే ప్రస్తుతానికి చూస్తే కూటమికే అని అన్న వారూ ఉన్నారు. మరి జనం ప్రభావం ఏ వైపునకు వెళ్తుందో వేచి చూడాలి.